4 నుంచి ‘చో’ సహజ సాగు పద్ధతిలో కోళ్ల పెంపకంపై శిక్షణ

Training on poultry farming in natural cultivation - Sakshi

దక్షిణ కొరియాకు చెందిన డా. చోహాన్‌ క్యూ సహజ సాగు పద్ధతిలో నాటు కోళ్లు, బ్రాయిలర్‌ కోళ్లను రసాయనాలు వాడకుండా, దుర్వాసన రాకుండా, సొంతంగా తయారు చేసుకునే దాణాతో పెంచే పద్ధతులపై అక్టోబర్‌ 4 నుంచి 25 రోజుల పాటు యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు న్యూలైఫ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు షిండే శివశంకర్‌ తెలిపారు. సహజ పద్ధతిలో కోళ్ల పెంపకంతోపాటు ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ నైపుణ్యాలపై కూడా ఆచరణాత్మక శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు కనీసం పదో తరగతి చదివి, 18 సంవత్సరాలు నిండాలి. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు తమ వివరాలను ఈనెల 23వ తేదీలోగా 81210 08002, 70133 09949 నంబర్లకు వాట్సప్‌ ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపాలని శివశంకర్‌ కోరారు. వ్యవసాయ డిప్లొమా చదివిన వారికి ఉచితంగా శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top