కౌల్‌ స్టైల్‌ ట్యూనిక్‌... యూనిక్‌

Time To Time Designers Continue To Make Changes To These Kurti Styles - Sakshi

ఫ్యాషన్‌

మహిళలకు చాలా సౌకర్యంగా ఉండే డ్రెస్‌ కుర్తీ. దీంట్లో ఎన్నో రకాల మోడల్స్‌ వచ్చాయి. ఎప్పటికప్పుడు డిజైనర్లు ఈ కుర్తీ స్టైల్స్‌లో మార్పులు తీసుకువస్తూనే ఉన్నారు. అలా వచ్చిందే ఈ కౌల్‌ స్టైల్‌ కుర్తీ. కౌల్‌ ట్యునిక్‌గానూ పిలిచే ఈ కుర్తీకి దుపట్టాను కూడా జత చేయడంతో సరికొత్తగా ముస్తాబయ్యింది.

►ఫిష్, ఫ్రెంచ్‌ స్టైల్‌ టెయిల్, లూజ్‌ హెయిర్‌.. కేశాలంకరణ ఈ ట్యునిక్స్‌కి బాగా నప్పుతుంది.

►సింపుల్‌ అండ్‌ స్టైలిష్‌గా కనిపించాలంటే సన్నని గోటా లేస్‌ ఉన్న దుపట్టాను జత చేసిన ఈ పార్టీవేర్‌ను ధరిస్తే చాలు.

►సంప్రదాయ, పాశ్చాత్య వేడుకలకు కొత్త హంగులు అద్దుతున్న ఈ స్టైల్‌ను స్త్రీలే కాదు పురుషులూ వేడుకలలో వాడుతున్నారు. సరికొత్తగా ముస్తాబు అవుతున్నారు.

►కౌల్‌ నెక్‌ ట్యూనిక్‌కు జరీ లేస్‌ దుపట్టాను జత చేయడంతో గ్లామరస్‌గా కనిపిస్తోంది.

►ఈ స్టైల్‌ కుర్తా ఎప్పటి నుంచో బౌద్ధ సన్యాసులు ధరించడం చూస్తుంటాం. సౌకర్యంగా ఉండే ఈ డ్రెస్‌ ఇప్పుడు కుర్తాగా రూపాంతరం చెంది ఫ్యాషన్‌ ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. ఈ కుర్తీ మోకాళ్ల కింది భాగం అంచులు మడిచినట్టు, పైకి దోపినట్టుగా ఉంటుంది. కుర్తా మెడ భాగం నుంచి వేలాడుతున్నట్టుగా దుపట్టా జత చేసి ఉంటుంది. స్లీవ్స్, స్లీవ్‌లెస్‌.. రెండు స్టైల్స్‌లో ఉండే ఈ కుర్తాలు ప్లెయిన్, ప్రింట్‌ కలర్‌ కాంబినేషన్‌తో డిజైన్‌ చేయడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. దీనికి బాటమ్‌గా సిగరెట్‌ ప్యాంట్, ట్రౌజర్‌ జత చేస్తే చాలు. గెట్‌ టు గెదర్‌ వేడుకలలో పాల్గొనడానికి సౌకర్యంగా ఉండటంతో పాటు ప్రత్యేకతను చాటుతుందీ డ్రెస్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top