అమ్మ కడుపే చల్లగా..! | There will be some more days in the womb | Sakshi
Sakshi News home page

అమ్మ కడుపే చల్లగా..!

Aug 21 2017 12:06 AM | Updated on Sep 17 2017 5:45 PM

అమ్మ కడుపే చల్లగా..!

అమ్మ కడుపే చల్లగా..!

నాక్కొంచెం గడువివ్వండి

సందర్భం

నాక్కొంచెం గడువివ్వండి
అమ్మకు నచ్చజెప్పుకుంటా
ఇంకొన్నిరోజులు ఇక్కడే ఉంటా

ఉమ్మనీరు మింగను
పేగు మెడకు మెలేసుకోను
అల్లరి చేయను... అడ్డం తిరగను
నాక్కొంచెం గడువివ్వండి

ఒక పూట పస్తుంటా
ఒకలెక్క పడుకుంటా
బరువు పెరగను... బాధపెట్టను
నాక్కొంచెం గడువివ్వండి
గోరఖ్‌పూర్‌ ఘోరం విన్నాను
నాబోటివాళ్ల ప్రాణాలు
గాలి అందక గాల్లో కలిసిపోయాయి

గుంటూరులో గుండెకోత గుర్తుంది
ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన శిశువు
రక్తమోడుతూ ప్రాణం విడిచింది

మీ దవాఖానాల్లో ఆక్సిజన్‌ నింపండి
ప్రసూతి వార్డుల్లో ఎలుకల్ని తరమండి
పందికొక్కలపై కొరడా ఝుళిపించండి
డాక్టర్లను డ్యూటీలో పెట్టండి
ఏలేవారి మెదడువాపుకి మందేయండి
అప్పటివరకూ...
నాక్కొంచెం గడువివ్వండి
అమ్మకు నచ్చజెప్పుకుంటా
ఇంకొన్నిరోజులు ఇక్కడే ఉంటా
గర్భంలో..!
– పూడి శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement