పక్షవాతం వస్తుందో రాదో ఈ పరీక్షతో కనిపెట్టేయొచ్చు! | Sakshi
Sakshi News home page

పక్షవాతం వస్తుందో రాదో ఈ పరీక్షతో కనిపెట్టేయొచ్చు!

Published Thu, Aug 20 2015 11:50 PM

పక్షవాతం వస్తుందో రాదో  ఈ పరీక్షతో కనిపెట్టేయొచ్చు! - Sakshi

కొత్త పరిశోధన
 
ఇది చాలా చిన్న పరీక్ష. ఒకే కాలిపై నిల్చొని, మరో కాలిని లేపి... నిటారుగా ఉన్న కాలి మోకాలి వద్ద ఆనించి 20 సెకన్లపాటు బ్యాలెన్స్ తప్పకుండా నిలబడగలరా? పరీక్షించి చూసుకోండి. అలా నిలబడగలిగితే చాలు... భవిష్యత్తులో పక్షవాతం, మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు చాలా తక్కువని జపాన్ పరిశోధకులు పేర్కొంటు న్నారు.

ఈ పరిశోధకులు 1,387 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనల్లో 67 ఏళ్ల వయసు ఉన్నవారినీ పరిశీలించారు. ఇలా కనీసం 20 సెకన్ల పాటు నిల్చోగలిగితే పక్షవాతం, మతిమరపు (డిమెన్షియా) వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తేలిన అంశాన్ని ‘స్ట్రోక్’ అనే మెడికల్ జర్నల్‌లోనూ పొందుపరచినట్లు జపాన్ పరిశోధకులు పేర్కొంటున్నారు.
 
 

Advertisement
Advertisement