పుకారు తెచ్చిన ప్రమాదం... | The collision brought the rumor ... | Sakshi
Sakshi News home page

పుకారు తెచ్చిన ప్రమాదం...

Sep 6 2015 11:25 PM | Updated on Sep 3 2017 8:52 AM

పుకారు తెచ్చిన ప్రమాదం...

పుకారు తెచ్చిన ప్రమాదం...

కిశోర్ కుమార్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు కొత్త తరంగంలా వచ్చినవాడు శైలేంద్ర సింగ్.

 ప్లేబ్యాక్ సింగర్

కిశోర్ కుమార్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు కొత్త తరంగంలా వచ్చినవాడు శైలేంద్ర సింగ్. తన కొడుకు రిషి కపూర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త గొంతును పరిచయం చేయాలని రాజ్‌కపూర్ అనుకున్నప్పుడు శైలేంద్ర సింగ్ తారసపడ్డాడు. ‘బాబీ’ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత రిషి కపూర్ నటించిన చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ పాడాడు. రవీంద్రజైన్ వంటి సంగీతకారులు కూడా మంచి మంచి పాటలు ఇచ్చారు. కాని ఒకసారి డయాబిటిస్ వల్ల రెండు మూడు రోజులు శైలేంద్ర సింగ్ హాస్పిటల్‌లో ఉండాల్సి వచ్చింది.

దాంతో ప్రత్యర్థులు ముంబైలో పుకార్లు పుట్టించారు. శైలేంద్రకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని ఇక మీదట రికార్డింగులు చేయలేడని పాడలేడనీ.... అలా అలా అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. పుకార్లను పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించాను అంటుంటాడు ఈ మంచిపాటగాడు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement