తిక్క లెక్క జిహ్వబలుడు | Ten kg | Sakshi
Sakshi News home page

తిక్క లెక్క జిహ్వబలుడు

Oct 15 2015 12:20 AM | Updated on Sep 3 2017 10:57 AM

తిక్క లెక్క  జిహ్వబలుడు

తిక్క లెక్క జిహ్వబలుడు

చూడటానికి ఇతగాడు బక్కపలచగా కనిపిస్తున్నాడు గానీ మహాబలశాలి.

చూడటానికి ఇతగాడు బక్కపలచగా కనిపిస్తున్నాడు గానీ మహాబలశాలి. మామూలుగా పది కిలోల బరువెత్తాలంటేనే రెండుచేతులూ ఉపయోగించి ఆపసోపాలు పడతాం. అలాంటిది ఇతగాడు ఏకంగా నాలుకతో బరువులను ఎత్తి పడేస్తాడు. బ్రిటన్‌లో ఉండే ఈ జిహ్వబలుడి పేరు థామస్ బ్లాక్‌థోర్న్.

మెక్సికో రాజధాని మెక్సికో సిటీలో ఏడేళ్ల కిందట జరిగిన ప్రదర్శనలో ఇతగాడు ఏకంగా నాలుకతో పన్నెండున్నర కిలోల బరువును అవలీలగా ఎత్తిపడేసి గిన్నెస్ బుక్‌లోకి ఎక్కాడు. జిహ్వబలప్రదర్శనలో ఇతగాడిది ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ మరి!
 
 

Advertisement
 
Advertisement
Advertisement