కార్డులన్నీ స్వైప్‌లో! | Swipe cards | Sakshi
Sakshi News home page

కార్డులన్నీ స్వైప్‌లో!

Feb 25 2015 12:18 AM | Updated on May 25 2018 6:12 PM

ఒకట్రెండు బ్యాంకుల క్రెడిట్, డెబిట్‌కార్డులు, ప్యాన్, ఆధార్ కార్డులు.. ఇంకొన్ని ఇతర కార్డులు - చాలామంది జేబుల్లో, పర్సుల్లో

ఒకట్రెండు బ్యాంకుల క్రెడిట్, డెబిట్‌కార్డులు, ప్యాన్, ఆధార్ కార్డులు.. ఇంకొన్ని ఇతర కార్డులు - చాలామంది జేబుల్లో, పర్సుల్లో సాధారణంగా కనిపించేవే. ఇన్ని కార్డులు మోతబరువు అనుకున్నారో ఏమో... ఓ కంపెనీ స్వైప్ పేరుతో ఓ వినూత్నమైన కార్డును అందుబాటులోకి తెచ్చింది. అన్నికార్డుల సమాచారం ఈ ఒక్కదాంట్లోనే నిక్షిప్తం చేసుకోవడంతోపాటు ఎప్పుడు ఏ కార్డు వాడాలో మీరే నిర్ణయించుకునే సౌకర్యం ఉండటం ఈ హైటెక్ కార్డు ప్రత్యేకత. వివిధ కార్డుల సమాచారాన్ని అప్‌లోడ్ చేసేందుకు ఒక్కోదాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది.

దీనికోసం స్వైప్‌తోపాటు ప్రత్యేకమైన రీడర్‌ను కూడా ఇస్తారు. స్కాన్ చేసిన ప్రతి కార్డు వివరం స్వైప్‌లో నిక్షిప్తమైన తరువాత పైన ఉన్న స్క్రాల్ బటన్ ద్వారా మీరు ఏ కార్డు వాడాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కో స్వైప్ కార్డులో దాదాపు 25 కార్డుల సమాచారం నిక్షిప్తం చేసుకోవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ తరహాకార్డుల్లో ఇదే అత్యధికం.
 
 

Advertisement
 
Advertisement
Advertisement