వేసవి మేకప్... | Summer make-up ... | Sakshi
Sakshi News home page

వేసవి మేకప్...

May 10 2015 11:38 PM | Updated on Sep 3 2017 1:48 AM

వేసవి మేకప్...

వేసవి మేకప్...

ఎండ, చెమట వల్ల ఈ కాలం మేకప్ చేసుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

అందమె ఆనందం
ఎండ, చెమట వల్ల ఈ కాలం మేకప్ చేసుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వేడుకలలో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో కూడా సింపుల్ మేకప్‌తో అందంగా మెరిసిపోవచ్చు.
 
ముందుగా ముఖాన్ని లిక్విడ్ సోప్‌తో శుభ్రపరుచుకోవాలి. తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా 5-6 సార్లు మృదువుగా రబ్ చేయాలి. తర్వాత వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్‌ను ముఖమంతా రాయాలి. ఇలా చేయడం వల్ల మేకప్ ఎక్కువ సేపు ఉండటమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.
మేకప్ చేయడానికి ముందు నాణ్యమైన ప్రైమర్ లోషన్‌ని ఎంచుకోవాలి. ఇది మేకప్‌కి బేస్‌గా పనిచే స్తుంది. ప్రైమర్‌ను వాడటం వల్ల మేకప్ మచ్చలుగా కనిపించదు. కంటి పై రెప్పకు కంటి చుట్టూతా కూడా ప్రైమర్‌ను అప్లై చేయాలి.
లిక్వ్‌డ్ బేస్డ్ ఫౌండేషన్‌ను బ్రష్‌తో ముఖమంతా రాయాలి.
లిప్‌స్టిక్ ప్యాచ్‌లుగా పెదవులపై కనపడకుండా, చేతులకు అంటుకోకుండా ఉండాలంటే టిష్యూపేపర్‌పైన కొద్దిగా పౌడర్‌వేసి, పెదవులపై అద్దాలి.
ఐ లైనర్‌తో కళ్లను తీర్చిదిద్దాలి.
 
 వేసవి కాబట్టి తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే చర్మం త్వరగా పొడిబారకుండా ఉంటంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటించి మేకప్ చేసుకుంటే వేడుకలో అందంగా మెరిసిపోతారు.
 - సౌమ్య జాదవ్, బ్యూటీషియన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement