టొమాటో కొబ్బరి బాత్‌

Special on Tomato Coconut Bath - Sakshi

క్విక్‌ ఫుడ్‌

తయారి సమయం: 45 నిమిషాలు

కావలసినవి:  బియ్యం – ఒకటిన్నర కప్పులు;  కరివేపాకు – రెండు రెబ్బలు; లవంగం – 1; దాల్చిన చెక్క – 1; ఉల్లిపాయ – 1;  టొమాటోలు – 3; తరిగిన కొత్తిమీర – అర టేబుల్‌ స్పూన్‌;  ఉప్పు – రుచికి సరిపడా; నూనె– టేబుల్‌ స్పూన్,  నెయ్యి – అర టేబుల్‌ స్పూన్‌; నీళ్లు – రెండున్నర కప్పులు

పేస్ట్‌ కోసం:వేయించిన ధనియాలు – అర టేబుల్‌ స్పూన్‌; వేయించిన జీలకర్ర – అర టీ స్పూన్‌; పచ్చి కొబ్బరి తురుము – 4 టేబుల్‌ స్పూన్లు; అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌; లవంగాలు – 3; దాల్చినచెక్క – 1, ఏలకులు – 2; తరిగిన కొత్తిమీర – టేబుల్‌ స్పూన్‌; పచ్చిమిర్చి – రెండు; ఉల్లిపాయ – 1
పై పదార్థాలన్నింటికీ కొద్దిగా నీటిని చేర్చి గ్రైంyŠ  చేసి పేస్ట్‌ చేసుకోవాలి.

తయారి: ∙పాత్రలో నూనె, నెయ్యి  వేడయిన తరవాత లవంగాలు, దాల్చిన చెక్క వేసి అర నిమిషం వేయించాలి. తరవాత ఉల్లిపాయముక్కలు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు జత చేసి నాలుగు నిమిషాలు వేయించాలి.
∙దీంట్లో గ్రైండ్‌ చేసిన పేస్ట్‌ వేసి 10 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఉప్పు, బియ్యం జత చేసి నిమిషంపాటు కలపాలి.
∙రెండున్నర కప్పుల నీళ్లు, ఉప్పు జత చేసి కలపాలి. 
∙మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిన తరవాత దింపేయాలి.
∙చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసి ఇష్టమయిన గ్రైవీతో వేడివేడిగా వడ్డిస్తే రుచిగా ఉంటుంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top