తెల్లదనమా? వద్దు! | special story on white hair | Sakshi
Sakshi News home page

తెల్లదనమా? వద్దు!

Sep 25 2016 1:23 AM | Updated on Sep 4 2017 2:48 PM

తెల్లదనమా? వద్దు!

తెల్లదనమా? వద్దు!

నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజంగా వచ్చే మార్పే కాని, ఈ జనరేషన్‌లో పదేళ్లకే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి.

నలభై ఏళ్లు దాటిన తర్వాత జుట్టు తెల్లబడడం సహజంగా వచ్చే మార్పే కాని, ఈ జనరేషన్‌లో పదేళ్లకే తెల్ల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. సమస్య స్పష్టంగా అద్దంలో కనిపించిన తర్వాత ట్రీట్‌మెంట్ తీసుకోవడం కంటే ముందుగా జాగ్రత్తపడితే మంచిది కదా!

⇔ రెండు వందల మిల్లీలీటర్ల కొబ్బరి నూనెలో ఒక టీ స్పూను కర్పూరం పొడిని కలిపి ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తలకు పట్టించి ఐదు నిమిషాల సేపు మసాజ్ చేసుకోవాలి.

⇔ కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపుకొని ప్రతిరోజూ తలకు పట్టిస్తుంటే చుండ్రు సమస్య తగ్గడంతోపాటు కేశాలు నల్లబడతాయి.

⇔ మల్లెతీగ వేళ్లను నిమ్మరసంతో కలిపి గ్రైండ్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తరువాత కడిగేయాలి.

⇔ తలస్నానానికి కుంకుడుకాయ, శీకాయవంటి సహజమైన షాంపూలనే వాడాలి.

⇔ తలస్నానం పూర్తయిన తరువాత మెల్లిగా చేతివేళ్ల కొసలతో తలని మసాజ్ చేయడం వల్ల సెబాసియస్ గ్రంథులు ఉత్తేజితం కావడంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

⇔ తాజా కొత్తిమీర ఆకుల రసం రాస్తే జుట్టుకి మంచి నిగారింపు వస్తుంది.

⇔ వీటితోపాటు చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారించాలంటే కాఫీ, టీ, మసాలాలు తగ్గించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement