స్కిన్ కౌన్సెలింగ్ | Skin counseling | Sakshi
Sakshi News home page

స్కిన్ కౌన్సెలింగ్

May 20 2015 11:36 PM | Updated on Sep 3 2017 2:23 AM

చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది ఎప్పుడూ మంచిదే.

ఇటీవలి ఎండలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. నేను ఎండలో వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్ రాసుకోవచ్చా? సన్‌స్క్రీన్‌లో ఎంత ఎస్‌పీఎఫ్ ఉన్నది వాడాలి?
 - రేఖరాణి, సికింద్రాబాద్
 
ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి ఈ కింది సూచనలు పాటించండి....

చర్మరక్షణ కోసం సన్ స్క్రీన్స్ ఉపయోగించడం అన్నది ఎప్పుడూ మంచిదే.  మన దేశంలో ఎస్‌పీఎఫ్ 25 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న సన్‌స్క్రీన్స్ వాడటం మంచిది.  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటి ఎండ నేరుగా పడేలా తిరగవద్దు.  అలాగని అస్సలు ఎండలో తిరగకపోవడం వల్ల వైటమిన్ డి లోపం క్యాల్షియమ్ లోపం కూడా రావచ్చు. అందుకే అప్పుడప్పుడూ ఎండ తగులుతూ ఉండాలి. అయితే ఇలాంటి ఎండ కోసం మధ్యాన్నం పూట బయట తిరగకండి. కేవలం ఎండపొడ లేతగా ఉన్న సమయంలో మాత్రమే బయట తిరగండి.
 
 డాక్టర్ మేఘనారెడ్డి కె.
 డర్మటాలజిస్ట్, ఒలీవా అడ్వాన్స్‌డ్
 స్కిన్ - హెయిర్ క్లినిక్,హైదరాబాద్    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement