నీరసం.. నిస్సత్తువ.. తగ్గేదెలా? | sakshi health councling | Sakshi
Sakshi News home page

నీరసం.. నిస్సత్తువ.. తగ్గేదెలా?

Jan 1 2017 11:30 PM | Updated on Sep 5 2017 12:08 AM

నా వయసు 38 ఏళ్లు. ఇటీవల నీరసంగా, నిస్సత్తువగా ఉంటే మా డాక్టర్‌గారు కొన్ని రొటీన్‌ పరీక్షలు చేయించి

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 38 ఏళ్లు. ఇటీవల నీరసంగా, నిస్సత్తువగా ఉంటే మా డాక్టర్‌గారు కొన్ని రొటీన్‌ పరీక్షలు చేయించి, హైపోథైరాయిడిజమ్‌ అని చెప్పారు. నాకు ఉన్న సమస్య ఏమిటి? హోమియో పద్ధతిలో ఇది తగ్గుతుందా? – నీరజ, కొత్తగూడెం
మన శరీరంలోని కీలకమైన గ్రంథి థైరాయిడ్‌. హైపో థైరాయిడిజమ్‌ సమస్య ఉన్న వారిలో ఇది మామూలుకన్నా తక్కువగా థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది.  

కారణాలు : ∙అయోడిన్‌ లోపం ∙పిట్యూటరీ గ్రంథి లోపాలు ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, తొందరపాటుతో వ్యవహరించడం ∙ఎక్కువగా యాంటీబయాటిక్స్‌ వాడటం ∙ఆటో ఇమ్యూన్‌ హైపోథైరాయిడిజమ్‌ ∙రేడియోథెరపీ.
హైపో థైరాయిడిజమ్‌లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి.
1) ప్రైమరీ హైపో థైరాయిడిజమ్‌: థైరాయిడ్‌ గ్రంథి టీ3, టీ4 హార్మోన్లను సరైన మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మత ఏర్పడుతుంది.
2) సెకండరీ హైపో థైరాయిడిజమ్‌: పిట్యుటరీ గ్రంథి సరైన మోతాదులో టీఎస్‌హెచ్‌ (థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌)ను ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మత వస్తుంది.

లక్షణాలు : ∙అలసట, నీరసం ∙నిద్రమత్తు ∙ఏకాగ్రత కోల్పోవడం ∙పెళుసైన గోళ్లు ∙పొడి జుట్టు ∙పొడిబారిన చర్మం, చలికి తట్టుకోలేకపోవడం ∙మలబద్దకం ∙శరీరం బరువు పెరగడం ∙రక్తహీనత ∙కీళ్లనొప్పులు ∙మానసిక ఒత్తిడి ∙రుతుస్రావంలో లోపాలు ∙వినికిడి లోపం ∙కండరాలలో నొప్పి, తిమ్మిరి.

చికిత్స : హైపోథైరాయిడిజమ్‌తో మొదలుకొని థైరాయిడ్‌కు సంబంధించిన ఏ సమస్య అయినా హోమియో విధానంలో సమర్థంగా తగ్గించవచ్చు. రోగి వ్యక్తిగత, శారీరక,  మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి సమస్యనైనా పూర్తిగా నయం చేయవచ్చు. అయితే అనుభవజ్ఞులైన ఆధ్వర్యంలో ఈ మందులను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, వారు సూచించిన విధంగా మందులు తీసుకుంటే మీ సమస్య పూర్తిగా తగ్గుతుంది.

డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి సీనియర్‌ డాక్టర్‌
పాజిటివ్‌ హోమియోపతి
హైదరాబాద్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement