వాటిలో  పురుగుమందుల అవశేషాలు

Remains of pesticides in them - Sakshi

పండ్లు కూరగాయలు ఆరోగ్యానికి మంచివే. అవి సహజ సిద్ధంగా పండించినవైతే అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, పురుగుమందులు వాడి పండించే వాటిలో కొన్ని పండ్లు, కూరగాయలు అత్యధిక మోతాదులో పురుగు మందుల అవశేషాలతో మార్కెట్‌లోకి వచ్చిపడుతున్నాయి. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో అమాయకంగా వాటిని తిన్నారంటే లేనిపోని వ్యాధుల బారిన పడే పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండే వాటిలో స్ట్రాబెర్రీ, పాలకూర చెర్రీ, యాపిల్, ద్రాక్షలు, బంగాళదుంపలు, టొమాటోలు వంటివి ముందు వరుసలో నిలుస్తున్నాయని, వీటిలో దాదాపు 98 శాతం దిగుబడుల్లో పురుగు మందుల అవశేషాలు బయటపడ్డాయని అమెరికా వ్యవసాయ శాఖ పరిధిలోని ఎన్విరాన్‌మెంటల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఇటీవల నిర్వహించిన పరిశీలనలో వెల్లడైంది. అయితే, ఉల్లిపాయలు, క్యాబేజీ, బొప్పాయి, మామిడి, వంకాయలు, కాలిఫ్లవర్, బ్రకోలి వంటి వాటిలో పురుగు మందుల అవశేషాలు నామమాత్రమేనని, ఇవి చాలావరకు సురక్షితంగానే ఉంటున్నాయని ఆ అధ్యయనంలో తేలింది.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top