విడగొట్టారా?

Priyanka Chopra and Nick Jonas Are Heading for a Divorce - Sakshi

ఇంగ్లీష్‌ అబ్బాయి.. ఈస్టిండియా అమ్మాయి... కాదే ప్రాంతము ప్రేమకు అనర్హము. ఇద్దరు మనసులూ కలిశాయి.. మనువాడాయి. ముడి పడి మూడు నెలలు కాలేదు. విడిపోవాలనుకుంటున్నారట. నిక్‌ జోనస్, ప్రియాంకా చోప్రా విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారరంటూ ‘నిక్‌యాంక’ అభిమానులకు షాక్‌ ఇచ్చింది హాలీవుడ్‌ మేగజీన్‌ ‘ఓకే’. వీళ్ల పెళ్లి ఇటీవలే వంద రోజులు దాటింది. ఈ జంట మరో వంద చూసే అవకాశం లేదన్నట్లుగా ఆ పత్రిక వార్తలు రాసింది. ఆత్మీయంగా ఉండే ఈ ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందని, నిక్, ప్రియాంక కటీఫ్‌ చెప్పుకున్నారని రాసుకొచ్చింది. ఇక.. నిక్‌యాంకల ప్రేమ, పెళ్లి గురించి చెప్పాలంటే.. లాస్‌ ఏంజెల్స్‌లో లవ్‌ చేసుకున్న వీళ్లిద్దరి పెళ్లి వేడుకలకు ఉదయ్‌ఘడ్‌ ప్యాలెస్‌ వేదికయింది. రెండు పెళ్లిలు (ఇరు సంప్రదాయల ప్రకారం), నాలుగు రిసెప్షన్లతో ఇద్దరు ఒక్కటయ్యారు.

వారంలో మిగతా ఐదు రోజులు షూటింగ్‌లతో బిజీగా ఉన్నా.. వీకెండ్‌ వస్తే విడదీయలేనంతగా హాలీడేలు, అవుటింగ్‌లకు వెళ్తున్నారు. ఇద్దరి అన్యోన్యత చూసి వీళ్ల వివాహం సూపర్‌ హిట్‌ అనుకున్నారంతా. సినిమా 150 రోజులు ఆడకముందే విడిపోతున్నారని హాలీవుడ్‌ మీడియా టాక్‌.  ‘‘పని, పార్టీ, ఖర్చు ఇలా ప్రతీ విషయంలో నిక్‌యాంకకు వాగ్వివాదాలు జరుగుతుంటాయట. పెళ్లికి ముందు వరకూ కూడా ప్రియాంక చాలా కూల్‌ అని, తేలికగా తీసుకునే మనిషి అనుకున్నారట నిక్‌. పెళ్లి తర్వాత తనలోని కంట్రోల్‌ చేసే తీరు, టెంపర్‌ చూశాడట. ఒకవేళ విడిపోతే మాత్రం ఇద్దరిమధ్య ఆర్థికపరమైన గొడవలు చాలా తలెత్తే అవకాశం ఉండదని కూడా సదరు పత్రిక పేర్కొంది’’ అని తెలిపింది.

 కానీ ఇదంతా ఉత్తుత్తి వార్తే అని, మియామీలో నిక్‌యాంక హాలీడే ఎంజాయ్‌ చేస్తున్నారని మరో వార్త. ఇదిలా ఉంటే తన మరిది ఫ్రాంక్లిన్‌ జోనస్‌ డిగ్రీ పట్టా పుచ్చుకున్న సందర్భంగా శుక్రవారం ట్వీటర్‌ ద్వారా ప్రియాంక అభినందనలు తెలిపారు. మరి.. మనస్పర్థలు ఉంటే ప్రియాంక ట్వీట్‌ చేస్తారా? అన్నది కొందరి అభిప్రాయం. ఆ పత్రికే వీరిద్దరినీ విడగొట్టిందని కొందరు అంటుంటే, ఆటపట్టించడానికి ఆ వార్త రాసిందని కొందరు అంటున్నారు.  ప్రచారంలో ఉన్న వార్త ఏంటంటే.. ప్రియాంక పెళ్లికి ముందే నిక్‌ తండ్రి కోర్టు కేసులో తలమునకలై ఉన్నారు. అప్పుల్లో ఉన్నట్లు కూడా సమాచారం. అవి తీర్చే క్రమంలో ప్రియాంక బ్యాంక్‌ అకౌంట్‌లోంచి కూడా కొంత డబ్బు తగ్గుతుందట. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి ప్రధాన కారణం అనే ప్రచారం జరుగుతోంది. మరి నిజమెంత?

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top