ప్రెగ్నెన్సీ టైమ్ పరీక్షల్లో బయటపడుతుంది | Sakshi
Sakshi News home page

ప్రెగ్నెన్సీ టైమ్ పరీక్షల్లో బయటపడుతుంది

Published Wed, Nov 2 2016 11:11 PM

ప్రెగ్నెన్సీ టైమ్ పరీక్షల్లో బయటపడుతుంది

గర్భిణుల్లో...

కొంతమంది మహిళలకు గర్భం దాల్చకముందే హైబీపీ ఉంటుంది. మరికొంతమందిలో గర్భం దాల్చిన 20వ వారంలో ఇది కనిపిస్తుంది. (ఒకవేళ 20వ వారం కంటే ముందే హైబీపీ ఉందంటే... వారికి అంతకు ముందే అధిక రక్తపోటు ఉందనీ, దాన్ని మొదట గుర్తించలేదనీ అర్థం. అంటే 20వ వారం కంటే ముందే రక్తపోటు ఉందంటే అది దీర్ఘకాలిక బీపీ అని, గర్భవతి అయ్యాక చేసే రక్తపరీక్షల్లో అది బయటపడిందని అనుకోవచ్చు. గర్భవతులకు ముప్పు ఉంటే అది మరెన్నో వైద్యసమస్యలకు కారణం కావచ్చు. ఒకవేళ అప్పటికే హైబీపీ ఉన్న మహిళలు గర్భం దాల్చాలని అనుకున్నప్పుడు వాళ్లు వాడే మందుల గురించి డాక్టర్‌ను సంప్రదించి, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ విషయంలో డాక్టర్ దగ్గరి నుంచి తగిన సలహాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలి. కొన్ని మందులను గర్భం ధరించిన సమయంలో అస్సలు తీసుకోకూడదు. ఉదాహరణకు ఆంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్, మూత్రం ఎక్కువగా అయ్యేలా చేసే డై-యూరెటిక్స్ వంటివి. అవి పిండానికి హాని చేకూర్చవచ్చు.

గర్భవతుల్లో వచ్చే హైబీపీ...
గర్భవతుల్లో వచ్చే హైబీపీని ‘జెస్టేషనల్ హైబీపీ’ అంటారు. గర్భం దాల్చిన 20వ వారంలో హైబీపీ కనిపిస్తే దాన్ని ‘ప్రీ అక్లాంప్సియా’ అంటారు. అంతకు మునుపు రక్తపోటు ఉన్న కొంతమంది మహిళల్లో ... గర్భం దాల్చాక మళ్లీ అది కనిపించవచ్చు. ప్రీ-అక్లాంప్సియా ఉన్న మహిళలకు ప్రసవమైన ఆరు వారాల తర్వాత ఆ కండిషన్ తగ్గి మళ్లీ మామూలు కావచ్చు.

అక్లాంప్సియా: ఇది ప్రీ-అక్లాంప్సియా కండిషన్ తర్వాత వచ్చే సమస్య. అక్లాంప్సియా సమస్య ఉన్నవారిలో అది ఫిట్స్‌కు దారితీయవచ్చు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అందుకోసమే సమస్య ప్రీ-అక్లాంప్సియా దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకొని అది అక్లాంప్సియా వరకు పోకుండా జాగ్రత్త పడాలి.

కారణాలు: గర్భవతుల్లో హైబీపీకి లేదా ప్రీ-అక్లాంప్సియాకు సరైన కారణాలు ఇంకా తెలియదు. నిజానికి గర్భధారణకూ, బీపీ పెరగడానికి ఏదో సంబంధం ఉన్నట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తెలిసింది. ప్లాసెంటా పెరుగుదలతో ఏర్పడే కొత్త రక్తనాళాలు అభివృద్ధి చెందడంతోనే సమస్య వస్తుందని నిపుణుల అభిప్రాయం. అయితే ప్రీ-అక్లాంప్సియా సమస్య ఉన్నప్పుడే గుర్తించి, తగిన చికిత్స తీసుకోవాలి. లేకపోతే అది పిండానికి ఆక్సిజన్, పోషకాలు అందడంపై దుష్ర్పభావం చూపవచ్చు.

గర్భధారణ సమయంలో హైబీపీతో సమస్యలు
{పీ-అక్లాంప్సియా సమస్య వల్ల కాబోయే తల్లికి పక్షవాతం రావచ్చు.
మూత్రపిండాలకు, కాలేయానికి సమస్య రావచ్చు.
రక్తం గడ్డకట్టే అవకాశాలు ఉండవచ్చు.

కడుపులోని బిడ్డకు...
బిడ్డ ఎదుగుదలలో సమస్య  నెలలు నిండకముందే ప్రసవం మృతశిశువు పుట్టే అవకాశం

గర్భవతుల్లో బీపీ ఉన్నట్లు తెలియడం ఎలా?
భరించలేనంత తలనొప్పి  కళ్లు సరిగా కనిపించకపోవడంమసకబారినట్లుగా ఉండటం  పొట్టనొప్పి (ముఖ్యంగా పొట్ట పైభా గంలో ఎదుర్రొమ్ము ఎముకల కింద, కుడివైపున నొప్పిగా ఉంటుంది.వేవిళ్లు కాకుండా ఆ తర్వాత కూడా వాంతులుకడుపులోని బిడ్డ కదలికలు సరిగా లేకపోవడం.గర్భం దాల్చిన కొంతమందిలో ముఖం ఉబ్బడం, కాళ్లు-చేతుల వాపు చాలా సాధారణం. అయితే ప్రీ-అక్లాంప్సియా ఉంటే అది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అలాంటి సమయంలో డాక్టరును తప్పక సంప్రదించాలి.

డాక్టర్ భాగ్యలక్ష్మిసీనియర్
గైనకాలజిస్ట్, అండ్ అబ్‌స్టెట్రీషియన్,యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

Advertisement
Advertisement