బ్యూటిప్స్‌

Packed With Lemon Juice The Skin Becomes Fresh - Sakshi

చర్మం మీద చేరే జిడ్డు తొలగి చర్మం తాజాగా నిగనిగలాడాలంటే ఇంట్లోనే ఇలా చేసి చూడండి.
►బ్యూటిప్స్‌ నిమ్మకాయ ముక్కతో ఇరవై నిమిషాల పాటు ముఖమంతా మర్దనా చేసి, చల్లటి నీటితో కడగాలి. (పొడి చర్మానికి ఈ చికిత్స పనికిరాదు).
►పలుచని ఆపిల్‌ ముక్కతో ముఖం, మెడ, చేతులు రుద్దుకుంటే చర్మగ్రంధుల నుంచి వెలువడే అదనపు నూనె తొలగిపోతుంది.
►అరటిపండు గుజ్జులో రెండు చుక్కల తేనె, రెండు చుక్కల గ్లిజరిన్, అర స్పూన్‌ నిమ్మరసం కలిపి ప్యాక్‌ వేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది.
►శనగపిండి కాని, పెసర పిండి కాని పాలతో కలుపుకుని స్నానానికి సబ్బుకు బదులుగా ఉపయోగించవచ్చు.
►మెంతులలో పాలు వేసి గ్రైండ్‌ చేసి ముఖానికి ప్యాక్‌ వేసి, ఆరిన తర్వాత వేడి నీటితో కడగాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top