సాధారణంగా చుండ్రు, బ్లాక్‌హెడ్స్, నిర్జీవమైన చర్మం వంటి సమస్యలకు ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, వీటన్నింటికీ మన వంటింట్లో ఉండే నిమ్మకాయతోనే సులభంగా చెక్ పెట్టవచ్చు. నిమ్మకాయలో ఉండే విటమిన్–సి చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో కొద్దిగా నిమ్మరసం రాయాలి. ఉదయాన్నే చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బ్లాక్‌హెడ్స్ పూర్తిగా తగ్గే వరకు ఈ చిట్కా పాటించవచ్చు. పొడి చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.
పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. నిర్జీవంగా మారిన జుట్టుకు మెరుపును తీసుకురావడానికి 3 చెంచాల నిమ్మరసం, అర కప్పు తేనె, ముప్పావు కప్పు ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు రాసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు 3 చెంచాల నిమ్మరసంలో ఒక గుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి. నెల రోజుల పాటు ఇలా చేస్తే చుండ్రు సమస్య మాయమవుతుంది.
చర్మటానిక్
కొరియాకు చెందిన జోసెయోన్ రాజవంశంలోని మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి పులియబెట్టిన బియ్యపు నీటిని చర్మ టానిక్‌గా ఉపయోగించేవారు. అమినో యాసిడ్లు, విటమిన్లు, పిండిపదార్థాలు పుష్కలంగా ఉండే ఈ నీరు చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. దీనిని అప్పట్లో మిగ్వామ్ అని పిలిచేవారు. ఈ నీరు మురికిని, మృతకణాలను సున్నితంగా తొలగిస్తుంది. బియ్యపు నీటిని పులియబెట్టడం వల్ల అందులో పిటెరా వంటి యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయి. ఇవి ముడతలను తగ్గించి, చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఎండ వల్ల దెబ్బతిన్న చర్మానికి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.
ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్‌ను ఈ పరికరాలలో పొందుపరచారు.
ఈ కెరాటిన్ ఎన్‌హ్యాన్స్‌డ్ ప్రొడక్ట్ లైన్‌లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్‌ను జుట్టుకు అందిస్తాయి. దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది.
ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్‌కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ప్రముఖ హెయిర్ కేర్ బ్రాండ్ ‘చి’ సరికొత్త సాంకేతికతతో కూడిన హెయిర్ స్టైలింగ్ సాధనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. జుట్టును స్టయిలింగ్ చేయడంతో పాటు రక్షణ ఇచ్చేలాగా ‘కెరాటిన్’ ప్రొటీన్‌ను ఈ పరికరాలలో పొందుపరచారు. ఈ కెరాటిన్ ఎన్‌హ్యాన్స్‌డ్ ప్రొడక్ట్ లైన్‌లో స్టైలర్, హెయిర్ డ్రైయర్, స్ట్రెయిటెనర్ వంటి మల్టీఫంక్షనల్ గాడ్జెట్స్ ఉన్నాయి. సాధారణంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్, డ్రైయింగ్ చేసినప్పుడు వేడి వల్ల జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ, ఈ సరికొత్త టూల్స్ స్టయిలింగ్ ప్రక్రియలోనే కెరాటిన్‌ను జుట్టుకు అందిస్తాయి.
దీనివల్ల జుట్టుకు మెరుపు వస్తుంది. జుట్టులోని తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా పొడిబారిన, కలరింగ్ చేయించుకున్న జుట్టు ఉన్నవారికి ఈ టూల్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ పరికరాలలో ఉపయోగించిన సెరామిక్ హీటింగ్ ఎలిమెంట్స్, అయాన్ జనరేషన్ టెక్నాలజీ కారణంగా జుట్టు కుదుళ్లకు వేడి వల్ల జరిగే నష్టం చాలా వరకు తగ్గుతుంది. ఇది మల్టీ–ఫంక్షనల్ స్టైలర్ కావడంతో ఈ కలెక్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకే పరికరంతో జుట్టును ఆరబెట్టుకోవడానికీ, కర్లింగ్‌కు, బ్రషింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.


