నవంబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On November 30, the birthday of celebrities | Sakshi
Sakshi News home page

నవంబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Nov 30 2015 1:32 AM | Updated on Sep 3 2017 1:13 PM

నవంబర్  30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

నవంబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వ ఆస్తిపాస్తులు అందుతాయి. ఉ

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
వాణీజయరామ్ (గాయని), నిషాకొటారి (బాలీవుడ్ నటి)

 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వ ఆస్తిపాస్తులు అందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభిస్తుంది. అయితే న్యాయసంబంధమైన వివాదాలలో ఇరుక్కుంటే బయట పడటం అంత సులభం కాదు కాబట్టి రాజీ ధోరణితో వ్యవహరించడం మంచిది. మేనేజ్‌మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లు, ఫైనాన్స్ రంగ ంలోని వారు, పారిశ్రామిక వేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పుంజుకుంటారు. వీరి పుట్టిన తేదీ 30. ఇది బృహస్పతి సంఖ ్య కాబట్టి జన్మతః నిశిత పరిశీలన, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా, కార్యదక్షులుగా పేరు తెచ్చుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు.

రచయితలు, వక్తలు, సంగీత క ళాకారులకు ప్రభుత్వ గుర్తింపు, ప్రోత్సాహకాలూ లభిస్తాయి. ఆపేసిన చదువును,  పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్లు: 1,2, 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, గ్రే, ఎల్లో, క్రీమ్, శాండల్ బ్లూ, వయోలెట్; లక్కీ డేస్: గురు, శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని, నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం, మతగురువులను, పెద్దలను గౌరవించటం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement