మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on-may-23-the-birthday-celebrated | Sakshi
Sakshi News home page

మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

May 23 2015 1:28 AM | Updated on Sep 3 2017 2:30 AM

మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. వీరికి ఈ సంవత్సరం ఆస్తుల విలువ...

ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కె.రాఘవేంద్రరావు (దర్శకుడు), చంద్రమోహన్ (నటుడు)
ఈరోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. వీరికి ఈ సంవత్సరం ఆస్తుల విలువ పెరుగుతుంది. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పోలీసులు, మిలిటరీ వారికి ఇది మంచి సమయం. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేయాలనుకునేవారి కల నెరవేరుతుంది. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలోని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్ ఇంజినీర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

గత సంవత్సరం మొదలు పెట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి మాత్రం ఇది తగిన సమయం కాదు. లక్కీ నంబర్స్: 1,5,6,9. లక్కీ డేస్: మంగళ, శుక్ర, ఆదివారాలు. లక్కీ కలర్స్: రోజ్, క్రీమ్, ఆరంజ్, రెడ్. సూచనలు: వాహనాలు నడిపేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. పదునైన ఆయుధాలు వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. రక్తదానం చేయడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, అనాథ విద్యార్థులకు సాయం చేయడం, సుదర్శన హోమం చేయించుకోవడం. 
    
 - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement