డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | on december11 to celebrate birthday celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Dec 10 2015 11:44 PM | Updated on Sep 3 2017 1:47 PM

డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు

దిలీప్ కుమార్ (నటుడు), ఆర్య (నటుడు), విశ్వనాథన్ ఆనంద్ (చెస్ చాంపియన్)

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు కాబట్టి చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న న్యాయ వివాదాలు, పెండింగ్‌లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమై ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరు పుట్టిన తేదీ 11 రెండు సూర్యసంఖ్యల కలయికతో ఏర్పడ్డది గనక వీరికి జన్మతః ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి.

సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో టీమ్ వర్క్‌తో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హ–{దోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది.

లక్కీ నంబర్స్: 1,2,3, 4, 5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దుర్గాదేవిని ఆరాధించడం, శునకాలకు ఆహారం పెట్టడం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం, పిల్లలకు, వృద్ధులకు తీపి par తినిపించడం.ఙ- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

Advertisement
 
Advertisement
Advertisement