ఆగస్టు 12న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On August 12, buying the birthday celebration | Sakshi
Sakshi News home page

ఆగస్టు 12న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Aug 11 2015 10:57 PM | Updated on Sep 3 2017 7:14 AM

ఆగస్టు 12న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఆగస్టు 12న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినదైనందువల్ల అధికారుల సహకారంతో,

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: పీట్ సాంప్రాస్ (టెన్నిస్ క్రీడాకారుడు)
 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినదైనందువల్ల అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా  నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. ఇంటిలో పాతవస్తువుల స్థానంలో ఖరీదైన ఫర్నీచర్‌ను అమర్చుకుంటారు.

పుట్టిన తేదీ 12 అంటే 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,69; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, ఆదివారాలు.

సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం,అనాథలను ఆదుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement