డిసెంబర్ 3న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On 3 December, the birthday Celebrities | Sakshi
Sakshi News home page

డిసెంబర్ 3న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Dec 2 2015 11:09 PM | Updated on Sep 3 2017 1:23 PM

డిసెంబర్  3న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

డిసెంబర్ 3న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు టెక్నికల్ రంగాలలో రాణిస్తారు.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
జిమ్మీ షేర్గిల్ (నటుడు), సారా జేన్ (నటి)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య కావడం వల్ల ఈ సంవత్సరం వీరు టెక్నికల్ రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. అయితే, ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ప్రమోషన్లు వస్తాయి. రాజకీయ నాయకులకు పదవులు వరిస్తాయి. ఈ రోజు పుట్టిన తేదీ 3. ఇది గురుసంఖ్య కాబట్టి వీరు జన్మతః మంచి తెలివితేటలు, మధురంగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు.

మీడియా రంగంలోని వారికి అనుకూలిస్తుంది. అయితే గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం అంత అనుకూలించకపోవచ్చు కాబట్టి నిరాశపడకుండా ఉండటం లేదా వచ్చే సంవత్సరం ప్రయత్నించడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 4,5,6,; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం, గురువులను, పండితులను గౌరవించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement