ఫుడ్‌ ప్యాకేజింగ్‌తో పోషకాలకు చిల్లు... | Nutrients with food packaging | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ ప్యాకేజింగ్‌తో పోషకాలకు చిల్లు...

Apr 13 2018 12:33 AM | Updated on Apr 13 2018 12:33 AM

Nutrients with food packaging  - Sakshi

ప్యాకెట్లలో వచ్చే తిండితో ఆరోగ్య సమస్యలు చాలా వస్తాయని చాలాకాలంగా తెలుసు. అయితే బర్మింగ్‌హామ్‌టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో విషయాన్ని ఆవిష్కరించారు. ప్యాకేజింగ్‌కు వాడిన పదార్థాల కారణంగా పోషకాలు ఒంటబట్టకుండా అడ్డుకుంటుందని వీరు అంటున్నారు. ప్యాకెట్ల లైనింగ్‌లో ఉండే జింక్‌ ఆక్సైడ్‌ నానోస్థాయిలో ఆహారంలోకి చేరుకోవడం వల్ల మన పేగుల్లో కణాలు సక్రమంగా పనిచేయవు. ఫలితంగా పోషకాలు శరీరానికి చేరకుండానే వ్యర్థాలుగా బయటికి వెళ్లిపోతాయి. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ద్వారా ఆహారం పాడవకుండా ఉండేందుకు జింక్‌ ఆక్సైడ్‌ ఉపయోగపడుతుంది. వీటివల్ల పెద్దగా సమస్యలు లేవని ఇప్పటివరకూ అనుకుంటూ వచ్చారు.

అయితే తాజా పరిశోధన వీటి ద్వారా కూడా పరోక్షంగానైనా కొన్ని సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేసింది. చిన్నపేగుల మోడల్‌ ఒకదాన్ని సిద్ధం చేసి తాము కొన్ని ప్రయోగాలు చేశామని, ఎంత మోతాదులో నానో కణాలు ఏ ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేశామని వీరు చెబుతున్నారు. జింక్‌ ఆక్సైడ్‌ నానో కణాలపై పొడుచుకు వచ్చే ప్రత్యేక భాగాలకు అతుక్కుంటాయి. ఈ భాగాలు పోషకాలు శరీరంలోకి చేరేందుకు అనువుగా విశాలమైన ప్రాంతాన్ని అందుబాటులోకి తెస్తాయి. వీటిపై జింక్‌ ఆక్సైడ్‌ చేరడం వల్ల సమస్యలు వస్తాయని తాము తెలుసుకున్నామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మాహ్లర్‌ చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement