తల ఊగిపోయేలా చేసే నాడింగ్ డిసీజ్! | Nodding disease that troubles head! | Sakshi
Sakshi News home page

తల ఊగిపోయేలా చేసే నాడింగ్ డిసీజ్!

Mar 6 2016 11:05 PM | Updated on Sep 3 2017 7:09 PM

తల ఊగిపోయేలా చేసే నాడింగ్ డిసీజ్!

తల ఊగిపోయేలా చేసే నాడింగ్ డిసీజ్!

ఏదైనా చల్లటి లేదా పుల్లటి పదార్థాన్ని నోట్లో పెట్టుకుంటే మన తల ఎలా వణుకుతుందో అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే.

మెడి క్షనరీ
ఏదైనా చల్లటి లేదా పుల్లటి పదార్థాన్ని నోట్లో పెట్టుకుంటే మన తల ఎలా వణుకుతుందో అందరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే. కానీ మామూలు పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నా తలను అలాగే కదిలించేలా చేస్తుంది ఈ ‘నాడింగ్ డిసీజ్’. తలను వేగంగా అలా కదిలిపోయేలా చేస్తుంది కాబట్టే దానికి ఆ పేరు. పిల్లలు ఏదైనా తినే సమయంలో తల అలా కదిలిపోవడమే కాదు... ఆ పిల్లల్లో మానసిక వికాసం లోపిస్తుంది. శారీరకంగా ఎదుగుదల కూడా ఆగిపోతుంది.

ఇది దక్షిణ సూడాన్, టాంజానియా, ఉత్తర ఉగాండా  ప్రాంతాల్లో 5 - 15 ఏళ్లలోపు  చిన్న పిల్లలకు వచ్చే ఒక వ్యాధి. టాంజానియాలో వైద్యచికిత్సలు అందిస్తున్న  డాక్టర్ లోజీ జిలెక్ ఆల్ అనే నార్వేజియన్ సైకియాట్రిస్ట్  1960 ప్రాంతాల్లో ఈ వ్యాధిని మొట్టమొదటిసారి రిపోర్టు చేశారు. ఆంకోసెరా ఓల్వులస్ అనే రకం నులిపురుగు వల్ల ఈ వ్యాధి వస్తుందని ఊహిస్తున్నారు. బ్లాక్‌ఫ్లై అని పిలిచే ఒక రకం కీటకం ద్వారా ఈ నులిపురుగుల వ్యాప్తి జరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా ఈ వ్యాధిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ (ఈఈజీ) అబ్‌నార్మల్‌గా ఉంటుందిగానీ మెదడు ద్రవం (సెరిబ్రోస్పైనల్ ఫ్లుయిడ్) నార్మల్‌గా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement