నో.... మిస్సమ్మ! | no missamma ! | Sakshi
Sakshi News home page

నో.... మిస్సమ్మ!

Mar 2 2015 12:15 AM | Updated on Sep 2 2017 10:08 PM

నో.... మిస్సమ్మ!

నో.... మిస్సమ్మ!

మాంచెస్టర్ (ఇంగ్లండ్)కు చెందిన మిస్ వెస్ట్... షాపింగ్ చేయడం అంటే ఇష్టం. అందులో భాగంగా రకరకాల ఐటమ్స్‌ను సేకరించడం అంటే కూడా బోలెడంత ఇష్టం.

సమ్‌థింగ్ స్పెషల్
 
మాంచెస్టర్ (ఇంగ్లండ్)కు చెందిన మిస్ వెస్ట్... షాపింగ్ చేయడం అంటే ఇష్టం. అందులో భాగంగా రకరకాల ఐటమ్స్‌ను సేకరించడం అంటే కూడా బోలెడంత ఇష్టం. అలా ఏకంగా 5,000 రకాల స్పైసీ గర్ల్స్ ఐటమ్స్‌ను సేకరించింది. ఇందుకోసం తన పొదుపు మొత్తాలను కూడా వినియోగించేది. 29 సంవత్సరాల వెస్ట్ తన 11వ ఏట నుంచే ఇలా ఆడపిల్లలకు సంబంధించిన వస్తువులను సేకరిం చడం ప్రారంభించింది.

కొత్తగా వచ్చిన ఏ వస్తువును ‘మిస్’ చేసేది కాదు. ‘‘మొదట్లో సరదాగా ఈ పని చేసినా తరువాత సీరియస్‌గా చేయడం ప్రారంభించాను’’ అంటుంది వెస్ట్. నచ్చిన వస్తువులు మార్కెట్‌లో దొరకకపోతే ఆన్‌లైన్ మార్కెట్‌లో కూడా కొనుగోలు చేసేది. మిస్ వెస్ట్ అభిరుచి ఊరకే పోలేదు. గిన్నిస్‌బుక్‌లో కూడా ఎక్కింది. తాజా విషయం ఏమిటంటే, తాను అనేక ఏళ్లుగా సేకరించిన వస్తువులతో లండన్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తోంది వెస్ట్. శుభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement