నానోకణాలతో కేన్సర్‌కు కొత్త చికిత్స..

New Treatment for Cancer with Nano Cells - Sakshi

పరి పరిశోధన 

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నానుడి. ఇది కేన్సర్‌ విషయంలోనూ వర్తిస్తుందని అంటున్నారు పెన్‌ స్టేట్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కేన్సర్‌ కణాలు రోగనిరోధక వ్యవస్థ కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతుందని.. తద్వారా వ్యాధి ముదిరిపోయేందుకు అవకాశముంటుందన్నది తెలిసిన విషయమే. కేన్సర్‌ కణితి చుట్టూ ఏర్పడే రక్తనాళాలు రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలను, మందులను కూడా అడ్డుకోవడం దీనికి కారణం.  ఈ సమస్యను అధిగమించేందుకు పెన్‌ స్టేట్‌ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతిపై ప్రయోగాలు చేశారు.

కేన్సర్‌ కణితిలోని కణాలను తీసుకుని వాటిల్లోకి కేన్సర్‌ చికిత్సకు వాడే మందులను జొప్పించారు. ఈ కణాలను మళ్లీ శరీరంలోకి జొప్పించినప్పుడు అవి కేన్సర్‌ కణాల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని నేరుగా కణితిపై దాడి చేయగలిగింది. సాలెగూడు పోగులు, బంగారు నానో కణాలు, తెల్ల రక్తకణాలతో గతంలో ఇలాటి ప్రయత్నం జరిగినప్పటికీ అంతగా ప్రభావం లేకపోయింది. తాజాగా మెటల్‌ ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌’తో తయారైన నానో కణాల్లోకి గెలోనిన్‌ అనే మందును జొప్పించి తాము ప్రయోగాలు చేశామని కణితినుంచి సేకరించిన గొట్టంలాంటి నిర్మాణాల్లోకి వీటిని చేర్చి ప్రయోగించినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త సియాంగ్‌ ఝెంగ్‌ తెలిపారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top