చేతులు మొక్కిన చీరలు | new fashon dress | Sakshi
Sakshi News home page

చేతులు మొక్కిన చీరలు

May 4 2017 10:43 PM | Updated on Sep 5 2017 10:24 AM

చేతులు మొక్కిన చీరలు

చేతులు మొక్కిన చీరలు

చీర మీద లేత రంగులు, అంతే అమరికగా ఇమిడిపోయే నూలు దారాల పువ్వులు మగ్గం మీదే పురుడు పోసుకుంటే

సృష్టిని... చేతిలో తీసుకొని ముద్దాడి... మగ్గానికి రాసి దోరగా... దారానికి పూసి నవ నవ... నవ్యదనం నేసి చేతులు మొక్కిన చీరలతో
నీ అందానికి దండం చేసి...


 
చీర మీద లేత రంగులు, అంతే అమరికగా ఇమిడిపోయే నూలు దారాల పువ్వులు మగ్గం మీదే పురుడు పోసుకుంటే... ఇలా అందంగా కళ్లకు కడతాయి.

రాయల్‌ బ్లూ కలర్‌ కాటన్‌ శారీకి మల్టీకలర్‌ బార్డర్‌ ఆకర్షణీయతను పెంచుతోంది. పార్టీవేర్‌లో ప్రత్యేకంగా నిలుపుతుంది.

చీరంతా ఒకే రంగు... దానికి ఓ సన్నని కాంట్రాస్ట్‌ అంచు... మరే ఆభరణమూ అక్కర్లేని హుందాతనం కాటన్‌ చీరకే సొంతం.

చీరంతా చెక్స్‌ వచ్చినా కాంట్రాస్ట్‌ కలర్స్‌తో మ్యాజిక్‌ చేసినా కాటన్‌ శారీదెప్పుడూ ఓ ప్రత్యేకత. వేసవికి ఆధునికపు హంగుగా ఉండే కాటన్‌ శారీ ఎవర్‌గ్రీన్‌!

సింపుల్‌గా అనిపించే తెలుపు రంగు కాటన్‌ శారీకి ప్రింటెడ్‌ కాటన్‌ బ్లౌజ్‌ స్టైలిష్‌ లుక్‌ను తీసుకువస్తుంది. క్యాజువల్‌ వేర్‌గానే కాదు ఈవెనింగ్‌ వేడుకల్లోనూ హైలైట్‌గా నిలుస్తుంది.

వేడుకల్లోనే కాదు ఫ్యాషన్‌ వేదికల మీదా కాటన్‌ ప్రత్యేకతను చాటుతోంది. అందుకే అతివల మనసు లేత రంగు లినెన్‌ కాట¯Œ  చీరల మీదకు మళ్లుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement