కట్‌చేస్తే! | new fashion show | Sakshi
Sakshi News home page

కట్‌చేస్తే!

Mar 2 2018 12:43 AM | Updated on Mar 2 2018 12:43 AM

new fashion show  - Sakshi

పెళ్ళిళ్లకి చీరలు కట్టుకోవడం  ఒకప్పటి సీను. కట్‌ చేస్తే.. ఇప్పుడు ఓణీయే  అదిరిపోయే సీను. పెళ్ళిళ్ల సీజన్‌లో పట్టు చీరలతో హాఫ్‌శారీస్,  లాంగ్‌ గౌన్లు..  డిజైన్‌ చేయవచ్చు.  కట్‌ చేయండి.. కట్టేయండి... వెలిగిపోండి.

పెద్ద పెద్ద అంచులు,, చిన్న చిన్న బుటీలు, అందమైన జరీ పువ్వులు పట్టు చీరకు అందాన్ని తీసుకువస్తాయి. చీరను అమ్మాయికి లంగాఓణీగా సింగారించాలంటే ఇలా అందంగా రూపుకట్టేయవచ్చు. కొంగు భాగాన్ని బ్లౌజ్‌గా, చీర భాగాన్ని లెహంగా ను డిజైన్‌ చేసుకోవచ్చు. వేరే కాంబినేషన్‌ ఓణీని తీసుకోవచ్చు. పట్టు ఓణీలు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి.



చీరను లంగా బ్లౌజ్‌గానే కాదు అనార్కలీ డ్రెస్‌ లేదంటే లాంగ్‌ గౌన్‌గానూ రూపుదిద్దుకోవచ్చు. ఇవి సంప్రదాయ వేడుకులకు స్టైలిష్‌గానూ, ఆధునికంగానూ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. పట్టు చీరలే కాకుండా మనవైన చేనేత చీరలను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు. ఈ తరహా డ్రెస్సింగ్‌ ఫ్యాషన్‌ వేదికల మీద హల్‌ చేస్తున్నాయి. 

ప్లెయిన్‌ పట్టు లేదా రాసిల్క్‌ మెటీరియల్‌ తీసుకొని దానికి చీర అంచులు జత చేయాలి. అలాగే బ్లౌజ్‌ పార్ట్‌ని కూడా తీర్చిదిద్దాలి. బ్లౌజ్‌ పార్ట్‌ని క్రాప్‌టాప్‌గా డిజైన్‌ చేసి, మిగతా చీర భాగాన్ని ఓణీగా తీసుకోవచ్చు. ఈ డిజై  స్టైల్స్‌ని నేటి తరం అమ్మాయిలే కాదు అమ్మలూ ధరించవచ్చు.


లెహంగా పార్ట్‌కి కావల్సిన పట్టు మెటీరియల్‌ కూడా మార్కెట్‌లో లభిస్తుంది. అయితే, బ్లౌజ్‌ పార్ట్‌కి సరైన కాంబినేషన్‌ దొరక్క ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లు వేస్తుం టారు. దీంతో లుక్‌ ప్రత్యేకత కనిపించదు. ఇందుకు లెహంగా, బ్లౌజ్‌ పార్ట్‌ని పట్టు, ఉప్పాడ, జరీ చీరలను వాడకం మొదలైంది. ఇవి సంప్రదాయ వేడకులకు తీరైన అందాన్ని తీసుకువస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement