అనార్వచనీయం

New fashion saree special 16 nov 2018 - Sakshi

ఫ్యాషన్‌

ప్యార్‌ కియా తో డర్నా క్యా అని అడిగింది నాటి అనార్కలి. ఉత్తరం, దక్షిణాలను కలిపితే తప్పేంటి అని అడుగుతోంది నేటి అనార్కలి. ఉత్తరాది అనార్కలి డ్రస్సును, దక్షిణాది లంగా ఓణీని కలిపి  ఈ ‘హాఫ్‌ శారీ అనార్కలి’ డ్రస్సును తయారుచేశారు.ఈ కొత్త అందం అనార్వచనీయంగా  ఉంది.

►‘డ్రెస్సింగ్‌ పూర్తి పాశ్చాత్య స్టైల్‌లో ఉండకూడదు. అలాగని మరీ సంప్రదాయబద్ధంగా ఓల్డ్‌ మోడల్‌లా అనిపించకూడదు’ అనేది నేటితరం మగువల కాన్సెప్ట్‌. అందుకే ఇండోవెస్ట్రన్‌ స్టైల్‌ కాన్సెప్ట్‌ అతివలను ఆపాదమస్తకం పట్టేసింది. లంగాఓణీ స్టైల్‌లో కనువిందు చేసే అనార్కలీ గౌన్లు సింగిల్‌పీస్‌ కంఫర్ట్‌నెస్‌తో మగువల మదిని దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

►క్రీమ్, గోల్డ్, బ్లాక్‌.. మూడు రంగులూ ఒకే డ్రెస్‌లో.. అదీ అచ్చూ లంగా ఓణీలా ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. లంగాఓణీలా ఈ డ్రెస్‌తో కుస్తీ అక్కర్లేదు. గౌన్‌లా ధరించవచ్చు. బ్యాక్‌ సైడ్‌ జిప్‌ అటాచ్‌తో పూర్తి ఫిటింగ్‌ తీసుకురావచ్చు.

►పెద్ద అంచు ఉన్న లెహెంగా, డిజైనర్‌ బ్లౌజ్, ఓణీ, నడుముకు వడ్డాణం .. ఈ గెటప్‌ చూడగానే లంగాఓణీ అనేస్తారు. కానీ, ఇది అనార్కలీ డ్రెస్‌. దీనికి బాటమ్‌గా చుడీ లెగ్గింగ్‌ ధరిస్తే న్యూలుక్‌తో ఆకట్టుకుంటారు.

►చర్మం రంగును పోలీ ఉండే నెట్‌ ఫ్యాబ్రిక్‌తో నడుము, వీపు భాగంతో డిజైన్‌ చేశారు, ఆరెంజ్‌  ఓణీ, క్రీమ్‌ కలర్‌ లెహంగా, గోల్డ్‌ కలర్‌ బ్లౌజ్‌పార్ట్‌ కాంబినేషన్స్‌తో అనార్కలీ డ్రెస్‌ను అందంగా తీర్చిదిద్దారు డిజైనర్లు.

►చెస్ట్, హిప్‌ కొలతల ప్రకారం లెహెంగా స్టైల్‌ అనార్కలీ గౌన్‌ని ధరిస్తే చాలు. ఈ స్టైల్‌ వేడుకలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది కాబట్టి ఇతరత్రా అలంకారాల గురించి అదనపు శ్రమ అవసరం లేదు. బన్, ఫిష్‌టెయిల్‌ స్టైల్స్‌ కేశాలంకరణ ఈ డ్రెస్‌లకు బాగా నప్పుతుంది. 

►లాంగ్‌ అనార్కలీ గౌన్‌కి అందంగా సెట్‌ చేసిన డిజైనర్‌ దుపట్టా, బ్లౌజ్‌ పార్ట్‌.. ఈవెనింగ్‌ గెట్‌ టుగెదర్‌ పార్టీలకే కాదు, వివాహాది సంప్రదాయపు వేడకులకూ ఈ డ్రెస్‌ మేలైన ఎంపిక. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top