రాణించండి

New fashion dresses in 2018 - Sakshi

ఫ్యాషన్‌

వేడుకలలో స్పెషల్‌గా కనిపించాలంటేఏ డ్రెస్సయినా వేసుకోవచ్చు.కానీ, రాణిలా.. యువరాణిలా దర్జా చూపించాలంటే ఈ లాంగ్‌ జాకెట్స్‌తొడుక్కోక తప్పదు. వీటినే కేప్స్‌ అని కూడా అంటారు. నెట్టెడ్, బనారస్, పట్టు వస్త్రాలతోచేసే ఈ లాంగ్‌ జాకెట్స్‌ ఏ డ్రెస్‌ మీదైనాహొయలు చిందిస్తాయి.  మిమ్మల్ని రాణించేలా చేస్తాయి.

వివాహ వేడుకలకుసంప్రదాయ వేడుకలకు రొటీన్‌ అలంకరణ బోర్‌ కొట్టచ్చు. అదే పలాజో డ్రస్‌మీదకు డిజైనర్‌ కేప్‌ ధరిస్తే వచ్చే ప్రశంసలే వేరు. 

డిజైనర్‌ స్కర్ట్‌ పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని క్రియేట్‌ చేశారు ఇది. పట్టు లెహెంగా మీదకు క్రాప్‌టాప్‌ని జత చేస్తేనే ఓ ఆకర్షణ. అలాంటిది దానికి నప్పే కోటును జత చేస్తే..వేడుకంతా ఒకే చోట కొలువుదీరనట్టే. 

ఈవెంట్‌ కాలేజ్‌ ఈవెంట్స్, స్టేజ్‌ షోస్‌ వంటి ప్రత్యేక సందర్భాలకు నప్పే స్టైలిష్‌ లుక్‌ని ఒక లాంగ్‌ కోటుతో తీసుకురావచ్చు.
లాంగ్‌ వెస్ట్రన్‌ గౌన్‌ మీదకు ఫ్లోర్‌ లెంగ్త్‌ ఫ్లోరల్‌ జాకెట్‌ ధరిస్తే చాలు మహారాణి కళతో వెలిగిపోతారు. 

క్యాజువల్‌ లుక్‌ కాటన్‌ కుర్తా లేదంటే టాప్, బాటమ్‌ వేసుకొని పైన ఓ కాటన్‌ కేప్‌ వేసుకుంటే చాలు దుపట్టా అవసరం లేకుండా సౌకర్యంగా అదే సమయంలో స్టైలిష్‌గా లుక్‌ని మార్చుకోవచ్చు. 

పట్టు కుర్తా – స్కర్ట్‌పెళ్లి, పుట్టిన రోజు సంప్రదాయ వేడుకలకు సరిపోయేలా స్టైల్‌ని ఎప్పుడూ కొత్తగా క్రియేట్‌ చేస్తుంటారు డిజైనర్లు. పట్టు లెహెంగా, క్రాప్‌టాప్‌ వేసుకొని, దానికి నప్పే కోటును జత చేస్తే.. వేడుకలో ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు.

జీన్స్‌తో జోడీ ఈ కాంబినేషన్‌కి మరో కట్‌ అవసరం లేదనుకుంటారు ఎవరైనా! కానీ, ఇప్పుడా మాటా కోటుతో మూలనపడింది. ఎందుకంటే ప్యాంట్‌ షర్ట్‌ లేదా ట్యూనిక్‌కి కోటు కూడా జత చేరి కొత్త హంగుతో చూపురుల మతులను పోగొడుతుంది.

సాయంకాలం పార్టీలకు చెదురుముదురుగా పడే జల్లులు, సాయంకాలం కొద్దిపాటి చల్లదనం, రాబోయే చలికాలానికి ఇంకాస్త వెచ్చదనం.. ఇలా కాలానికి వెచ్చని స్నేహాన్ని పంచే లాంగ్‌ జాకెట్‌ పార్టీకి ఎనలేని హుషారునిస్తోంది. ఇండో వెస్ట్రన్‌ స్టైల్‌ మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ అయి గెట్‌ టుగెదర్‌ పార్టీలకు ఉల్లాసాన్ని ఇస్తోంది.

∙ఇది ఇండో వెస్ట్రన్‌లుక్‌ కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణలు అక్కర్లేదు.

∙కోటు లేదా ఇన్నర్‌కుర్తా ప్లెయిన్‌గా ఉంటే సిల్వర్‌ జువెల్రీ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు.

∙కేశాలంకరణకు ప్రత్యేక శ్రద్ద అవసరం లేదు. నిగనిగల కురులను పొడవుగా లేదా పొట్టిగా ఒదిలేసినా అలలుగా ఎగిసిపడుతున్న జుట్టు ఈ తరహా డ్రెస్‌కు బాగా నప్పుతుంది.

∙ప్యాంట్‌– షర్ట్, పలాజో లాంటివి అయితే మీడియమ్‌ లేదా పెన్సిల్‌ హీల్‌ని వాడచ్చు. మిగతా కాంబినేష్‌కి ప్లాట్‌ చెప్పల్‌ లేదా శాండిల్స్‌ను ఉపయోగించవచ్చు.

∙ఈ తరహా డ్రెస్‌కి మేకప్‌ హంగామా కూడా పెద్దగా అవసరం పడదు. నేచురల్‌గా ఉండటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి.

∙కోటు డిజైన్‌లలో పాదాలను తాకేలా ఉన్నా,  మోకాలు వరకే సరిపుచ్చినా భిన్నమైన స్టైల్‌తో  మెరిసిపోవాల్సిందే! ధరించిన డ్రెస్‌కి జాకెట్‌ తెచ్చే  సౌకర్యవంతమైన లుక్‌ ఇప్పుడు అమ్మాయిలకు ఆప్తురాలైంది.

∙ పాశ్చాత్య దేశాలలో వెచ్చదనానికి వేసుకునే ఈ లాంగ్‌ కోట్‌ ఇప్పుడు కొన్ని మార్పులతో స్టైలిష్‌ వేర్‌గా ఇండియాలో గ్రాండ్‌గా అడుగుపెట్టింది. అన్ని వయసుల వారు ఈ కేప్‌కి హార్ట్‌ఫుల్‌గా వెల్‌కమ్‌ చెప్పడమే కాకుండా, అన్ని హంగులు అద్ది హుందాగా ధరిస్తున్నారు. 

నిర్వహణ: ఎన్‌.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top