ఛలో బ్యాంకాక్‌! | Nakshatram team heads to Bangkok | Sakshi
Sakshi News home page

ఛలో బ్యాంకాక్‌!

Feb 26 2017 1:15 AM | Updated on Sep 15 2019 12:38 PM

రెజీనాకు మేకప్‌ సరిచేస్తున్న కృష్ణవంశీ - Sakshi

రెజీనాకు మేకప్‌ సరిచేస్తున్న కృష్ణవంశీ

పాటలు కనువిందుగా ఉండాలంటే ఏం చేయాలి? లొకేషన్స్‌ అదిరిపోవాలి. అలాంటి లొకేషన్స్‌ కోసం ‘నక్షత్రం’ చిత్రబృందం బ్యాంకాక్‌ వెళ్లింది.

పాటలు కనువిందుగా ఉండాలంటే ఏం చేయాలి? లొకేషన్స్‌ అదిరిపోవాలి. అలాంటి లొకేషన్స్‌ కోసం ‘నక్షత్రం’ చిత్రబృందం బ్యాంకాక్‌ వెళ్లింది. అక్కడి అందమైన పరిసర ప్రాంతాల్లో మూడు పాటలు చిత్రీకరించనున్నారు. ఇక, సినిమా కథ ఏంటంటే... పోలీసు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న యువకుడి కథ ఇది. సందీప్‌ కిషన్,రెజీనా నాయకా నాయికలు. సాయి ధరమ్‌ తేజ్, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘‘రామాయణంలో హనుమంతుని పాత్రకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో, సమాజంలో పోలీసు పాత్రకు అంతే ఉంటుంది.

అదెలాగో నా సినిమాలో చూడండి’’ అంటున్నారు చిత్రదర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమా టాకీ పూర్తయింది. నేటి నుంచి బ్యాంకాక్‌లో పాటల చిత్రీకరణ ఆరంభిస్తారు. ఒక పాటను సందీప్‌కిషన్, రెజీనా పై, మరోపాటను సాయిధరమ్, ప్రగ్యాపై చిత్రీకరించనున్నారు. అక్కడే ఓ ప్రత్యేక పాటను కూడా షూట్‌ చేస్తారు. ఆ పాట వివరాలు బ్యాంకాక్‌ నుంచి వచ్చిన తర్వాత  తెలియజేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని భీమ్స్, భరత్‌ అందిస్తున్నారు. శ్రీచక్ర మీడియా సారధ్యంలో బుట్టబొమ్మ క్రియోషన్స్‌ కె.శ్రీనివాసులు, విన్‌విన్‌విన్‌ క్రియేషన్స్‌ వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement