ధ్యానం... అంతరయానం! | Meditation ... interruption! | Sakshi
Sakshi News home page

ధ్యానం... అంతరయానం!

Aug 16 2017 12:06 AM | Updated on Nov 9 2018 6:23 PM

ధ్యానం... అంతరయానం! - Sakshi

ధ్యానం... అంతరయానం!

అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే.

ఆత్మీయం

అతి చిన్న విత్తనం నుంచే అంత పెద్ద మర్రిచెట్టు పుట్టిందన్న సత్యం అందరికీ తెలిసిందే. అయితే అది ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే మనం ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం ఎక్కడికో కాదు, మన(సు)లోకే... అలా ప్రయాణం చేయడానికి కావలసింది ఏకాగ్రత, నమ్మకం, ఆత్మవిశ్వాసం. ఆ మూడూ కావాలంటే ధ్యానం చేయడమే సరైన మార్గం. ధ్యానానికి , యోగానికి సాక్షాత్తూ ఆ పరమశివుడే ఆదిపురుషుడు.

ఆది పరాశక్తి నుంచి త్రిమూర్తుల వరకు మహర్షుల నుంచి మహాయోగుల వరకు ప్రతి ఒక్కరూ ధ్యానం (తపస్సు)లో తరించినవారే. మనమందరం ధ్యానించేది ఆ దేవుళ్లనే కదా, మరి ఆ దేవుళ్లు ధ్యానించేది ఎవరిని అన్న సందేహం కలగటం సహజం. నిజమే మరి! దేవతలకన్నా బలమైన, మహత్తరమైన మహాశక్తి మరోటి ఉంది. ఆ శక్తే మనస్సు. మనస్సు బలంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేయగలం. ఆ మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికే ధ్యానం చేయడం అవసరం. ధ్యానం అంటే నిర్మలమైన, నిశ్చలమైన నీలోకి నీవు చేసే ప్రయాణం.

Advertisement
 
Advertisement
Advertisement