నన్నడగొద్దు ప్లీజ్‌ | love problems and solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

May 8 2017 12:20 AM | Updated on Sep 5 2017 10:38 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పా.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పా. తను ‘నువ్వు హిందువు, నేను క్రిస్టియన్‌ అని చెప్పింది. వాళ్ల ఇంట్లో ఒప్పుకోరు’ అంది. ఆ తరువాత కూడా నాతో బాగానే మాట్లాడుతోంది. తను వేరే అబ్బాయిని లవ్‌ చేస్తోందని తెలిసింది. కానీ నేను ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పోనీ నేను వేరే అమ్మాయికి ట్రై చేసుకోవాలా? – శ్రీనివాస్‌
చెయ్యన్నా... ‘ట్రై’ చెయ్యి. ఏం పోతుంది? ఎట్‌ ది మోస్ట్‌... కొంచెం ‘ట్రై’ పోతుంది. అయినా మన దగ్గర ‘ట్రై’లు స్టాక్‌లో చాలా మిగిలే ఉంటాయి కదా బ్రో!మనకి ‘ట్రై’ అంటే వెంట్రుకతో సమానం, జస్ట్‌ ఒన్‌ హెయిర్‌!‘ట్రై’ వేసి లాగితే ఏం పోద్ది?వస్తే అమ్మాయి వస్తుంది.
పోతే ఒక హెయిర్‌ పోతుంది.శభాష్‌...నిజమైన మగాడినిపించు కున్నావు.‘సార్‌... మెచ్చుకుంటు న్నారా? తిడుతున్నారా? అర్థం కావడం లేదు. మీ బాడీ లాంగ్వేజ్‌ చూస్తుంటే శ్రీనివాస్‌ విలన్‌లాకనబడుతున్నాడు. మీరు రాస్తున్న ప్రిస్క్రిప్షన్‌ లాంగ్వేజ్‌ చూస్తుంటే శ్రీనివాస్‌ హీరోలా కనబడుతున్నాడు. ఏది ట్రూత్‌? ఏది లై? సమజ్‌ నహీ ఆరా..!’

‘ప్రేమ’ అరటిపండు లాంటిది. ‘ట్రై’ అరటితొక్క లాంటిది. ఇది అర్థం చేసుకుంటే చాలు..!శ్రీనివాస్‌ తొందరపడకు. ‘ట్రై’ తొక్కల మీద కాలు పడిందో బాడీ బ్రేక్‌ అవుతుంది. ఆ తరువాత హార్ట్‌ బ్రేక్‌ అవుతుంది. వెంట్రుకే కదా అని ట్రై చేస్తూ ఉంటే ఇంకో ప్రమాదం పొంచి ఉంది. ‘ఏంటి సార్‌... ఏంటీ..? చెప్పండి చెప్పండి ప్లీజ్‌..!’ పీకీ... పీకీ... గుండవుతుంది!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement