
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ భయ్యా! మీ ఆన్సర్స్ చదువుతుంటా.
లవ్ డాక్టర్
హాయ్ భయ్యా! మీ ఆన్సర్స్ చదువుతుంటా. కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని చెత్తగా ఉంటాయి. సమాజంలో మంచి చెడు లాగ. నాకూ ఓ స్టోరీ ఉంది. నేను ముస్లిం. తను హిందు. నాలుగేళ్లు సంతోషంగా ఉన్నాం. మీ చెల్లి బంగారం పేరు రాజ్యం. అది నేను పెట్టుకున్న పేరు. వాళ్ల ఇంట్లో మాట్లాడా... బాగా చూసుకుంటానని చెప్పాను. ఇవ్వం పొమ్మన్నారు. చివరిగా మాట్లాడుకున్నాం. బాగుండాలని కోరుకున్నాం. అంతే తన నుంచి, అక్కడ నుంచి దూరంగా వచ్చేశాను. కామన్ ఫ్రెండ్ ద్వారా తనకు పెళ్లి అయిపోయిందని తెలిసింది. అంతా బాగానే ఉంది కానీ, నైట్ పడుకునే ముందు కళ్లల్లో నీళ్లు, గుండె నిండా బరువు. మరిచిపోలేకపోతున్నా. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. – షేక్ దస్తగీర్
భలేగా నచ్చేశావురా... పిచ్చగా నచ్చేశావురా... ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. నీ లాంటి ప్రేమికుడు ఒక్కడు చాలు. ప్రపంచం చల్లగా నిద్రపోవచ్చు. నీకు నిద్ర పట్టకపోయినా... నీ కళ్లల్లో కన్నీళ్లు పొంగినా... నీ హార్ట్ గోల్డ్ రా అబ్బీ. సూపర్‌గా నచ్చేశావు. అల్లాహ్ నీకు చాలా ప్రేమను ఇస్తాడు. అమ్మాయిని కష్టపెట్టకుండా... నువ్వు కష్టపడ్డానికి రెడీ అయిపోయావు. దట్స్ ఏ రియల్ జెంటిల్‌మన్ ‘సార్ మీ ఆన్సర్లు చెత్తగా ఉన్నాయని చెప్పినా ఇంత రెస్పెక్ట్ ఏంటి సార్?’ నన్ను గెలకు ఉన్నన్ని అరటిపండ్లకు సమానంగా తిట్టినా పడతాను.
నా చెల్లెలిని కష్టపెట్టలేదు అదే చాలు. ‘చాలా ఎమోషనల్ అయిపోతున్నారు సర్... షేక్ దస్తగీర్ ఈ తొక్క ఆన్సర్‌కు ఏమయిపోతాడో ఏంటో పాపం..’ ఏమవుతాడు..? పొద్దున్న లేచి కళ్లు తుడుచుకుని గొప్ప జీవితం జీవిస్తాడు. కన్నీళ్లతో తడిచిన కళ్లల్లో మళ్లీ కలల సేద్యం చేస్తాడు.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com