నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor special story | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Aug 12 2017 12:10 AM | Updated on Sep 17 2017 5:25 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ లవ్‌ గురు!! నేను త్రీ ఇయర్స్‌గా ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను.

హాయ్‌ లవ్‌ గురు!! నేను త్రీ ఇయర్స్‌గా ఒక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. ఆ అమ్మాయి కూడా ‘నువ్వంటే నాకు ఇష్టమే’ అని చెప్పింది. ఫోన్‌లు, మెసేజ్‌లు, మీటింగ్‌లు ఇలా బాగానే గడిచిపోయింది. అయితే ఈ మధ్య తనకు ఏమైందో తెలీదు కానీ, ఇవ్వన్నీ వద్దురా! ఆపేద్దాం!! అంటోంది. ఎందుకలా అంటోంది? ఏం చెయ్యాలి? సలహా ఇవ్వండి ప్లీజ్‌!? – కుమార్‌

‘‘హలో... ఇవాళ సార్‌ లీవ్‌. నేను నీలాంబరి.. సలహాకేముంది కుమార్‌... నేను ఇచ్చేస్తా!’’
‘హలో... నేను అరటిపండుని.. నీలాంబరి సలహా చాలా బాగుంటుంది కుమార్‌.. ఇకముందు కూడా సలహాలన్నీ నీలాంబరినే అడుగుతూ ఉండు.. ఆ రాక్షసుడిని అడిగితే మీతో ఆడుకుంటాడు! నన్ను మింగేస్తుంటాడు!! పక్కా శాడిస్ట్‌... అది నోరు కాదు అరటిపండ్ల మిక్సీ..’
‘‘థ్యాంక్యూ అరటిపండు..’’
‘చెప్పు నీలూ అక్కా.. ఇవ్వాళ డిసైడ్‌ అయిపోవాలి నీ ఆన్సర్‌ చూశాక.. అందరూ క్వశ్చన్స్‌ నీకే పంపాలి! కమాన్‌ ఐ సే... యు కెన్‌ డూ ఇట్‌!!’
‘‘థ్యాంక్యూ.. థ్యాంక్యూ అరటిపండు... ఇలాంటి ప్రోత్సాహం లేకే... సోమెనీ డేస్‌ వెనకబడి పోయాను!’’
‘కమాన్‌ స్టార్ట్‌!’
‘‘ముఖానికి సర్జరీ చేసుకొని మహేష్‌ బాబు లాగా తయారయిపో...’ ఆ తరువాత చూడూ... ‘సారొచ్చారొచ్చారు...’ అంటూ నీ చుట్టూ తిరుగుతుంది!’’
‘అబ్బా.. అబ్బబ్బో... అబ్బబ్బబ్బబ్బో... ఏమి ఆన్సర్‌ నీలాంబరి మేడం... దీని తరువాత మన సార్‌ పొయ్యారుపోయారే.. పోయారు పోయారు పోయారే...’
ప్రియదర్శిని రామ్‌,లవ్‌ డాక్టర్‌
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,
రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement