నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Apr 15 2017 12:35 AM | Updated on Sep 5 2017 8:46 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

నాకు 21 ఏళ్లు. బీఈ అయిపోయింది. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను.

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

నాకు 21 ఏళ్లు. బీఈ అయిపోయింది. టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీకు సిల్లీగా అనిపించొచ్చు. కాని నిజం. నేను టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అయితే మొదట్లో అది ప్రేమ కాదు ఆకర్షణ అనుకున్నాను. కాని ఆరేళ్లయినా ఆ అమ్మాయిని మరచిపోలేకపోతున్నాను.నా డిగ్రీ నాలుగేళ్లలో ఆమెకన్నా అందమైన అమ్మాయిలను ఎంతోమందిని చూశాను. కాని వాళ్లెవరూ నన్ను కదిలించలేకపోయారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను.

కాని ఆ అమ్మాయికి నా పట్ల అదే ఫీలింగ్‌ ఉందో లేదో తెలీదు. ఆమె, నేను ఫేస్‌బుక్‌లో రెగ్యులర్‌గా చాట్‌ చేసుకుంటూ ఉంటాం. ప్రపోజ్‌ చేయాలని ఉంది. కాని తను నో అంటే..! అన్న భయం. అదీ గాక మా మతాలు కూడా వేరు. వాళ్లది సనాతన సంప్రదాయ కుటుంబం. కాని ఆ అమ్మాయి అవేవీ నమ్మదు. వాళ్ల తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నేనేమో ఆ అమ్మాయిని తప్ప ఇంకొకరిని యాక్సెప్ట్‌ చేయలేను. ఏం చేయాలో సలహా ఇవ్వండి సర్‌!? – రెహ్మాన్‌ నవాజ్‌

రెహ్మాన్‌ నవాజ్‌ ప్యార్‌ బహుత్‌ జలీల్‌ హై! దిల్‌ కో బనాతా హై.. దిల్‌కో తోడ్‌దేతా హై! ప్రేమ మనసును పులకింపచేస్తుంది.. పూడ్చేస్తుంది!
ఏం చేద్దాం భాయ్‌? ఏం చెయ్యగలం భాయ్‌?! ప్రేమించిన అమ్మాయికి ప్రేమను ఇవ్వలేం. ప్రేమించిన అమ్మాయిని ఇంకొక అయ్య చేతిలో పెడుతుంటే చూడలేం. క్యా కర్నా బోలో..?

‘సర్‌.. తెలుగులో చెప్పనా?’ అంది నీలాంబరి. ‘బోలో‘.. ‘అమ్మాయి ఇంటికి వెళ్లి పేరెంట్స్‌కి చెప్తే అయిపోతుంది’ రెండు పీకితే? ‘పీకించుకోవాలి! ప్రేమకోసం అంత కూడా చెయ్యలేకపోతే వై లవ్‌?’ రెహ్మాన్‌ నవాజ్‌ ఒక అరటి గెల తీసుకెళ్లు... వర్క్‌ అవుట్‌ అవుతుంది.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement