
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్! నా పేరు బిందు. నా చైల్డ్‌హుడ్ నుంచీ ఒక అబ్బాయి, నేనూ చాలా డీప్లవ్ చేసుకుంటున్నాం.
లవ్ డాక్టర్ రీవిజిట్
హాయ్ సర్! నా పేరు బిందు. నా చైల్డ్‌హుడ్ నుంచీ ఒక అబ్బాయి, నేనూ చాలా డీప్లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. మా ఇంట్లో చెప్పాం.. పెళ్లి చేసుకుంటామని. కాని పేరెంట్స్ ఒప్పుకోవడంలేదు. తను లేకపోతే నేను బతకలేను. నాకు ఏదైనా సొల్యూషన్ చెప్పండి. – బిందు
‘నీలాంబరీ, నువ్వు చెప్పు బిందు ఏమి చెయ్యాలి..?’ ‘నాట్ నైస్ సర్! డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నీ నాకు ఇస్తున్నారు.’ ‘దీంట్లో డిఫికల్ట్ ఏముంది?’ ‘అమ్మాయి, అబ్బాయి బోత్ లవింగ్.. వెరీ.. వెరీ.. వెర్రి లవింగ్’ ‘మమ్మీడాడీ సేయింVŠ వెరీ సారీ.. నో, వెర్రి లవ్ నాట్ ఎలౌడ్.’ ‘ఇప్పుడు బిందు క్యా కర్నా హై?’
‘సర్.. టూ మచ్ సర్! ఇంత డిఫికల్ట్ క్వశ్చన్‌కి ఆన్సర్ ఎలా చెప్పాలి సర్?’ ‘మరి నేను చెప్పనా?’ ‘చెప్పండి సర్.. అరటిపండు కస్టర్డ్ ఇస్తా!’
‘పాపం వెర్రి ప్రేమకథ... పేరెంట్స్ ఒప్పుకుంటే పోలా?’ ‘ఒప్పుకోవడం లేదు కదా సారూ..?’ ‘మనకు రాసిన ఉత్తరం పేరెంట్స్‌కి చూపిస్తే పోలా?’ ‘గ్రేట్ ఐడియా సర్! అప్పుడు మళ్ళీ ప్రేమైనా పండుద్ది లేదా మీ ప్రాక్టీస్ అయినా తొక్కలో కలిసిపోతుంది!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com