నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Apr 8 2017 12:17 AM | Updated on Sep 5 2017 8:11 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

మై లవ్లీ డాక్టర్‌ రామ్‌ గారికి. నా పేరు హరీష్‌. మా ఊరిలో ఓ అమ్మాయిని 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా.

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

మై లవ్లీ డాక్టర్‌ రామ్‌ గారికి. నా పేరు హరీష్‌. మా ఊరిలో ఓ అమ్మాయిని 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా. మా ఇద్దరి రిలేషన్‌ బాగుంటుంది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. పెళ్లి తరువాత జీవితం గురించి చాలా కలలు కన్నాం. అయితే మా కులాలు వేరు కావడంతో మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఎక్కడికైనా వెళ్లిపోదాం రమ్మంటే రానంటుంది. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం అంటుంది. నన్ను ఏం చెయ్యమంటారు? – హరీష్‌
ముందు నిన్ను నువ్వు బాగా చూసుకో. తరువాత నీ కుటుంబాన్ని బాగా చూసుకో. తరువాత నీ బంధువులను బాగా చూసుకో. తరువాత నీ ఊరిని బాగా చూసుకో. ఇంత కంటే గొప్ప వాడివయితే జిల్లానీ.. రాష్ట్రాన్నీ.. దేశాన్నీ.. ప్రపంచాన్నీ.. బాగా చూసుకో. ‘సార్‌.. హరీష్‌ ప్రేమ ప్రాబ్లమ్‌తో రాస్తే, మీరేంటి పొలిటికల్‌ సైన్స్‌ క్లాసు పీకుతున్నారు?’ అని అడిగింది నీలాంబరి. ‘కులం కూడా కుటుంబం లాంటిదే. నీ కులాన్ని నువ్వు ప్రేమించు. అంతకంటే గొప్పవాడివి అవ్వగలిగితే ఏ కులమైనా.. మనిషిని ప్రేమించు. హరీష్‌ తన తల్లితండ్రులకు ఈ మాట చెప్పి చూడాలని చెబుతున్నా.’ ‘ఆ తరువాత తమలపాకులో అరటిపండు పెట్టి నిశ్చితార్థానికి మిమ్మల్ని పిలవాలా సార్‌’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement