లవ్ డాక్టర్ రీవిజిట్
సార్! నా పేరు రవి. వయసు 26. వన్ ఇయర్ నుంచి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. తన వయస్సు 33. ఆ అమ్మాయి తన ఇంటివారిని విడిచి ఒక పట్నంలో ఉంటూ స్టాఫ్ నర్స్‌గా ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తోంది. 10 సంవత్సరాల నుంచి తనకు, తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. నాకు అమ్మ, నాన్న, పెళ్లి అయిన ముగ్గురు అక్కలు ఉన్నారు. అక్కల పెళ్లిళ్ల సమయంలో అప్పులు చేశాం. కొన్ని అప్పులకు నేను కూడా సంతకం పెట్టాను.
ఇప్పుడు అమ్మా వాళ్లు వేరే సంబంధం చూసి వివాహం చేసుకోమంటున్నారు. నేను ప్రేమించే అమ్మాయి గురించి చెప్పాను. అమ్మాయి నీకంటే పెద్దది. జీవితంలో చాలా కష్టాలు పడతావు వద్దంటున్నారు. మా వాళ్ల మాట వినలేక, ఆమెను వదులుకోలేక బాధపడుతున్నా. అమ్మా నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోలేకపోతున్నా. మీరు నాకు తగిన సలహా ఇవ్వండి. ప్రతిరోజు సాక్షిలో మీ సమాధానాలు చదువుతాను. చాలా బాగుంటాయి.
– రవి, ఈ మెయిల్
‘నన్ను అలా చూడకండి..’ నేను తల తిప్పేసుకున్నా.‘నన్ను చూసి అలా తల తిప్పేసుకోకండి. హాఫ్ టర్నింగ్ ఇచ్చి కూర్చోకండి’
బల్ల కింద తల పెట్టుకున్నా. ‘డర్టీ లుక్స్ ఇవ్వకండి’ ఫ్యాన్ చూస్తూ కూర్చున్నా. ‘ఇన్ని నాటకాలు వేసే బదులు నా ఏజ్ ఎంతో అడగొచ్చుగా..?’ ‘నీలాంబరీ! వాడెవడో రవి అట. థర్టీ త్రీ ఇయర్స్ నర్స్‌ను ప్రేమించాడు. కాబట్టి నీ వయస్సు ఎక్కడ అడుగుతానో అన్న అనుమానంతో నా ఫేస్ టర్నింగ్‌లు చేయించడం వెరీ వెరీ బాడ్ నర్స్గారు. హెడ్ ఎక్స్‌సర్‌సైజ్ అవుతుంది కానీ, నీ ఏజ్ తెలియదు కదా..’
‘యు వాంట్ టు నో మై ఏజ్..?’ అని ఉరిమి ఉరిమి చూసింది.
‘నీ ఏజ్ నాకు తెలియదా నీలూ... స్వీట్ సిక్స్టీన్... జెస్ట్ వన్ ఇయర్ హియర్ ఆర్ దేర్... అంతే కదూ..’ నీలాంబరి మిలమిలలాడుతున్న అరటిపండు చేతికి ఇచ్చి ‘యు ఆర్ చో.. చ్వీట్..’ అని ముద్దుగా చెప్పింది. రవీ! అమ్మాయి ఏజ్... నీ ఈగో గేజ్ అంతా జాన్తా నహీ. ఇంటి అప్పులు తీర్చి ఇంటి వాడవైపో...
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Thu, Apr 6 2017 11:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement