నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Apr 6 2017 12:33 AM | Updated on Sep 5 2017 8:01 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! నేను బీటెక్‌ చదువుతున్నాను. నేను మా క్లాస్‌లో ఓ అమ్మాయిని చూశాను.

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

హాయ్‌ సర్‌! నేను బీటెక్‌ చదువుతున్నాను. నేను మా క్లాస్‌లో ఓ అమ్మాయిని చూశాను. నాకు బాగా నచ్చింది. తనని పెళ్లి చేసుకోవాలని ఉంది. తనతో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ముందు ఎలా అప్రోచ్‌ అవ్వాలో అర్థం కావడంలేదు. సడన్‌గా ప్రపోజ్‌ చేస్తే ఆ అమ్మాయి ఎలా రెస్పాండ్‌ అవుతుందో తెలియదు. ఇప్పుడే చేయడం కరెక్టా.? లేక క్లోజ్‌ అయిన తరువాత ప్రపోజ్‌ చేయడం కరెక్టా? మీరే చెప్పండి సర్‌... –సెల్వరాజ్‌

కాసిన్ని రోజుల్లో నైరుతి పవనాలు స్టార్ట్‌ అవుతాయి. అదేనోయ్‌... సౌత్‌–వెస్ట్‌ విండ్స్‌. స్మార్ట్‌ ఫోన్‌లో కంపస్‌ యాప్‌ ఎక్కించు. గుడికి వెళ్లి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టు. గుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కొట్టు. ‘సార్‌... నూట ఎనిమిది అరటిపళ్ల దక్షిణ కూడా’ అంది నీలాంబరి ఎక్సైట్‌మెంట్‌తో... పూజారితో ఫోన్‌కి అక్షింతలు వేయించు. మంచి ముహూర్తం తీయించు. గుడి బయటకు వచ్చి అమ్మాయి ఇంటికి సౌత్‌ వెస్ట్‌ డైరెక్షన్‌ ఫిక్స్‌ చేసుకో... ఇక దొర్లు... దొర్లుతూ, దొర్లుతూ అమ్మాయి ఇంటికి సౌత్‌ వెస్ట్‌ లొకేషన్‌లో ఉన్న పర్వతం మీదకు దొర్లుకుంటూ నీ లవ్‌ కమిట్మెంట్‌ ఊరంతా చాటి చెప్పు. కొండెక్కాకా దులుపు, బాగా దులుపుకో... ఆ తరువాత ఫోన్‌లో అమ్మాయికి టెక్ట్స్‌ మెసేజ్‌ పెట్టు... సౌత్‌–వెస్ట్‌ విండ్స్‌ నీ లవ్‌ ప్రపోజల్‌ను అమ్మాయికి అందిస్తాయి. ఓకే అంటే ఆల్‌ ఓకే.నోకే... అంటే కొండ దిగద్దు. ‘ఎందుకు సార్‌’.. అమ్మాయి మందీ మార్బలం తో ఎటాక్‌ చేస్తే సేఫ్‌ కదా... ‘పొండి సర్‌! ఏదో సాయం చేయమంటే స్టోరీలుచెబుతున్నారు. పాపం ఫీల్‌ అయిపోతాడు..’ అంత ఫీల్‌ అయ్యే బదులు ధైర్యంగా అమ్మాయి దగ్గరకు వెళ్లి సంస్కారవంతంగా... గుడ్‌ మార్నింగ్‌ మేడం, టుడే ఈజ్‌ గుడ్‌ డే, మీరు అనుకోకుండా ఎదురుపడ్డారు, నన్ను కన్సిడర్‌ చేస్తారా? మిమ్మల్ని ఆరాధిస్తాను, పువ్వుల్లో పెట్టుకుని పూజిస్తాను, ఏ విషయం ఆలోచించి చెప్పండి... అని డైరెక్ట్‌గా ఏడవచ్చు కదా..? నువ్వు నాకు అరటిపండు ఇవ్వచ్చు కదా..?
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement