నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor answers | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Jun 1 2017 12:13 AM | Updated on Sep 5 2017 12:28 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! నేను డిగ్రీ చదువుతున్నాను. రెండేళ్ల క్రితం మా సిస్టర్‌ పెళ్లికి ఒక కర్నాటక అమ్మాయి వచ్చింది.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను డిగ్రీ చదువుతున్నాను. రెండేళ్ల క్రితం మా సిస్టర్‌ పెళ్లికి ఒక కర్నాటక అమ్మాయి వచ్చింది. అప్పటి పరిచయంతోనే మేము మంచి స్నేహితులమయ్యాం. తనని కలవడానికి కర్నాటక కూడా వెళ్లాను. నా ఫ్రెండ్‌ ఒకడు ఆ అమ్మాయిని తాను లవ్‌ చేస్తున్నట్లు చెప్పాడు. దాంతో మా మధ్య కాస్త గ్యాప్‌ వచ్చింది. కానీ... తరువాత తను కూడా నన్ను లవ్‌ చేసింది. అయితే కొన్ని రోజుల తరువాత ఎగ్జామ్స్‌ కారణంగా నేను తన ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యలేదు.

మెసేజ్‌లకు కూడా బదులివ్వలేదు. తన నాకోసం చాలా వెయిట్‌ చేసింది. కానీ తరువాత నా ఫోన్‌ మిస్‌ కావడం వల్ల... తనను కాంటాక్ట్‌ చెయ్యలేక పోయాను. అందుకే మా మధ్య 2 ఇయర్స్‌ గ్యాప్‌ వచ్చింది. ఈ మధ్యే తన నెంబర్‌ దొరికింది. కాల్‌ చేస్తే చాలా హర్ట్‌ అయ్యింది. జరిగింది చెప్పినా నాపై కోపంగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి. – మధు

ఫోన్‌ పోయిందా? ‘పోయిందని చెబుతున్నాడు కదా సార్‌ ఎందుకు డౌట్‌?’ గేమ్స్‌ ఆడుతున్నాడు! ‘సిన్సియర్‌ కాదని ఎలా... ఎలా తెలుస్తుంది..?’ ప్రేమించే అమ్మాయిని అంతగా ఫాలో అయిన వాడికి... ఫోన్‌ నంబర్‌ గుర్తు ఉండదా? ప్రేమించేవాడు నిద్రలో ఉన్నా ఒక్క తన్ను తన్నితే అమ్మాయి నంబర్‌ టక్కున చెప్పేస్తాడు. ఫోన్‌ పోయిందట! అందుకే గ్యాప్‌ వచ్చిందట! గ్యాప్‌లో ఇంకో లవ్‌ స్టోరీ జరిగింది! అదీ అసలు కథ! ‘మీరు లవ్‌ డాక్టర్‌ కాదు సార్‌ లవ్‌ డిటెక్టివ్‌ సార్‌’ అని అరటిపండు ఇచ్చింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement