
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ రామ్, నేను నాలుగేళ్ల నుండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను
లవ్ డాక్టర్
హాయ్ రామ్, నేను నాలుగేళ్ల నుండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. నేను వర్క్ చేసే కంపెనీలోనే మా బిటెక్ కాలేజ్ అమ్మాయి కూడా జాయిన్ అయింది. తనతో నాకు కాలేజీలో అంత పరిచయం లేదు. ఆఫీస్‌కి వచ్చాక బాగా క్లోజ్ అయ్యాం. రోజూ తనతో మినిమమ్ రెండు గంటల టైమ్ స్పెండ్ చేసేవాడిని. ఇంకా చాటింగ్ ఔటింగ్‌కి వెళ్లేవాళ్లం. తనతో జర్నీ స్టార్ట్ చేసిన మూడు నెలలకే నాకు ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ అది అట్రాక్షనా లేక లవ్వా.. అని నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుందామని ఒక సంవత్సరం పాటు తనకి చెప్పలేదు. నార్మల్‌గా మూవ్ అయ్యా. చివరికి ఒకటిన్నర సంవత్సరం తర్వాత చెప్పాను.
తను నా నుండి ఇలాంటిది ఎక్స్‌పెక్ట్ చెయ్యలేదు. నువ్వు నా ఫ్రెండ్‌వి అనుకున్నా అన్నది. కానీ మనకి అలా లేదే! ఏం చేస్తాం. తనని మర్చిపోలేక 10 టైమ్స్ పైనే చెప్పి వుంటాను. (లిటరల్లీ అడుక్కొని ఉంటాను). తర్వాత రెండు సంవత్సరాల్లో తను ‘నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే’ అని నాతో మాట్లాడడం కూడా మానేసింది. తను నాకు పరిచయం అయ్యి నాలుగేళ్లకు పైనే అయింది. నేను చెప్పి మూడేళ్లు అవుతోంది. నా వల్ల కావట్లేదు తనని మర్చిపోవడం. తనని లవ్ చేశాక అమ్మాయిలంటే రెస్పెక్ట్ పెరిగింది. నా ఇంటెలిజెన్స్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. కానీ తను మాత్రం ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి. తనకి ఇంకా చెప్తూనే ఉన్నా... రెండు– మూడు నెలలకోసారి. నాది ట్రూ లవ్ అని తనకి ఎలా చెప్పాలి. తను ఒప్పుకునేలా ఎలా చెప్పాలి. – దీపు
నా పేరు అరటిపండు. ఇది సెకండ్ టైమ్... నేను మీ ముందుకు రావడం. దీపూ! ఇలాంటి క్వశ్చన్స్ ఈ మీసాల రాక్షసుడిని అడగకు.
అసలు లవ్ అంటే ఏ బి సి డి తెలియని దానవుడు.‘అడుక్కునేవాడు ఒక ఇంటిముందు కాకపోతే ఇంకో ఇంటిముందు అడుక్కుంటాడు. అంతే కానీ, ఒకే ఇంటిముందు అడుక్కుంటూ ఉంటే న్యూసెన్స్ కేసు పెడతారు. ఆగేబడో’... అని ఆన్సర్ ఇస్తాడు.నన్ను మింగినట్టు నీ ఇగోను, ఉనికిని మింగిపారేస్తాడు. నా మాట విని ఇంకో లవ్ డాక్టర్ని చూసుకో. ఆల్ ది బెస్ట్.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com