సుదీర్ఘ హిమస్నానం | Long ice bath | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ హిమస్నానం

Jan 18 2016 11:53 PM | Updated on Aug 21 2018 2:34 PM

సుదీర్ఘ హిమస్నానం - Sakshi

సుదీర్ఘ హిమస్నానం

చలికాలంలో చన్నీటి స్నానం చేయాలంటేనే జనాలు వణికి ఛస్తారు... అలాంటిది మంచుముక్కల్లో స్నానం చేయడం సాధ్యమేనా..?

తిక్కలెక్క
చలికాలంలో చన్నీటి స్నానం చేయాలంటేనే జనాలు వణికి ఛస్తారు... అలాంటిది మంచుముక్కల్లో స్నానం చేయడం సాధ్యమేనా..? నెదర్లాండ్స్‌కు చెందిన ఈ అసాధ్యుడు ఎవరూ ఊహించని ఈ సాహసానికి ఒడిగట్టాడు. విమ్ హోఫ్ అనే ఈ డచ్చి వీరుడు మంచు ముక్కలు నింపిన టబ్బులో పీకల్లోతు వరకు మునిగి, తాపీగా 1 గంట 13 నిమిషాల 48 సెకన్ల పాటు హిమకాలాడి, సుదీర్ఘ హిమస్నానంలో గిన్నిస్ రికార్డు సాధించాడు. ఇతగాడి ఘనత ఇదొక్కటే కాదు, ఇప్పటి వరకు ఏకంగా ఇరవై ప్రపంచ రికార్డులు సాధించాడు. కేవలం షార్ట్స్, టీషర్ట్ వేసుకుని, ఎవరెస్టు శిఖరంపైకి 22 వేల అడుగుల ఎత్తు వరకు ఎగబాకిన రికార్డు కూడా ఈ డచ్చి వీరుడిదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement