మనసు మాట వినండి | Listen to the voice of the mind | Sakshi
Sakshi News home page

మనసు మాట వినండి

Sep 25 2015 10:42 PM | Updated on Jun 1 2018 7:37 PM

మనసు మాట వినండి - Sakshi

మనసు మాట వినండి

జీవితంలో మనకు ఏది అవసరమో భగవంతుడు అది తప్పకుండా ఇస్తాడు.

సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు
 
టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
జీవితంలో మనకు ఏది అవసరమో భగవంతుడు అది తప్పకుండా ఇస్తాడు. నిరాశపడకండి.  మీ కోరికలు నెరవేరేందుకు, మీకు సరైన జీవిత భాగస్వామి లభించేందుకు మార్గం సుగమం అవుతుంది ఈ వారం. మీకు ఇష్టమైన ఉద్యోగాన్ని పొందడం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చే యండి. విజయాన్ని సాధించండి. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
ఆఫీసులో మీరు చేస్తున్న పని ఏదో దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా చేయండి. మీ పనిలో మార్పుతోబాటు ప్రమోషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకోసం మీకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించండి. వ్యాపార వృద్ధితోబాటు, విస్తరణకు కూడా అవకాశం ఉంది. కలిసొచ్చేరంగు: పసుప్పచ్చ
 
జెమిని (మే 21-జూన్ 21)

కలలు కనండి. మీ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయండి. మీకు అనేక రకాలైన అవసరాలు ఉండవచ్చు. ఇక్కడే ఎంపిక అవసరమవుతుంది. ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.  మీరు చేసే పనికీ, వచ్చే ఆదాయానికీ పొంతన లేదు కదా అనుకోకుండా పని చేస్తూ పోతే ఆదాయం అదే వృద్ధి అవుతుంది. కలిసొచ్చే రంగు: నారింజ రంగు
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
రోజులు మారుతుంటాయి. కాలం మారుతూ ఉంటుంది. ఎప్పుడూ మీకు అనుకూలంగానో, ప్రతికూలంగానో ఉండదు. ఒకవేళ జీవితమనే నౌక ప్రయాణ దిశ అదుపు తప్పిందనిపించినప్పుడు చుక్కానిని మీ చేతుల్లోకి తీసుకుని, దానిని మీకు అనుకూలమైన మార్గంలోకి మళ్లించుకోండి. మార్గం సుగమం చేసుకోండి. కలిసొచ్చే రంగు: నీలం
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 మీ మనసుతో మీరు సంభాషించండి. మనసు చెప్పేది విని, చేస్తే అంతా మంచే జరుగుతుంది. మీ మీద నమ్మకంతో పైవాళ్లు మీకు అప్పగించిన పనిని నిజాయితీగా చేసి, వారికి మీపైన ఉన్న నమ్మకం నిజమేనని రుజువు చెయ్యండి. ముఖ్యమైన కొనుగోళ్లను తొందరపడి చెయ్యకుండా, అందులో అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
అవతలి వాళ్లు మీ మాటలను, చేతలను చాలా బాగుంది అని మెచ్చుకునేలా చేయండి. అలాగే ఇతరుల నుంచి కూడా మీరు అదే ఆశించండి. ఏమి జరిగినా సరే, అంతా మంచే అనుకోండి. అందరూ బాగుండాలని కోరుకోండి. అప్పుడు తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. విజయం మీకు చేరువ అవుతుంది. కలిసొచ్చే రంగు: తెలుపు
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 భవిష్యత్తు గురించి ఆలోచించి, దానిని బంగారంలా మలచుకోవడం ఎలాగో తెలుసుకోండి. వాటిని సాకారం చేసే దిశగా పని చెయ్యండి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొత్తవారిని తీసుకునే ముందు బాగా ఆలోచించుకుని నమ్మకస్థులనే గలవారినే తీసుకోండి. అందుకోసం పెద్దల సలహా తీసుకోండి. తర్వాత విచారించి లాభం ఉండదు. కలిసొచ్చే రంగు: బేబీ పింక్
 
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)

 మీ మనసులో, మీ ఆలోచనల్లో ఉన్నట్టుండి మార్పు రావచ్చు. భవిష్యత్తు గురించి బెంగ కలగవచ్చు. భయపడకండి. అంతా మంచే జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు విచారించడం మానండి. మీ చుట్టూ ఉన్న వారితో మృదువుగా, మంచిగా మెలగండి. మీ ఆలోచనలను మీ శ్రేయోభిలాషులతో పంచుకోండి. మీ దిగులు తీరుతుంది. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
భావోద్వేగాలనేవి చాలా తమాషా పాత్ర పోషిస్తాయి. ఒక్కోసారి మన బాధలకు పూతమందులా పని చేస్తాయి. మనస్సును, శరీరాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపి మన శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తాయి. ఈ వారం మీ విషయంలో అదే జరగవచ్చు. మీ హృదయం చెప్పినట్లు చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది. కలిసొచ్చే రంగు: లేత బూడిదరంగు
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అయితే మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే మాత్రం చిక్కుల్లో పడవచ్చు. పెద్దలను గౌరవించడం, నిబంధనలను పాటించండి. అవతలి వారికి మీరు ఏమిస్తారో, వారి నుంచి తిరిగి మీకు అదే వస్తుంది. మీరు కోరుకున్నదానిని సొంతం చేసుకోవాలంటే గట్టి ప్రయత్నం చేయక తప్పదు. కలిసొచ్చే రంగు: నారింజ రంగు
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)

మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఒక్కసారిగా ప్రముఖుల సరసన చేరిపోతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. మీది కలివిడి స్వభావం అయితే ఇతరులతో మీరు మరింత చేరువ అవుతారు. అదే మీరు ఒంటరి వారయితే కొత్త వ్యక్తిని కలుస్తారు. వారితో మీకు సుదీర్ఘకాలం పాటు కొనసాగే కొత్త బంధం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
అనవసరమైన ఆవేశానికో, తాత్కాలికమైన సాంత్వన కోసమో మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీ శక్తి సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకోండి కానీ, ఇతరుల కోసం వాటిని మీకు మీరుగా అణగదొక్కుకోవద్దు. మీ సహోద్యోగి మాటలు వినండి కానీ, మరీ గుడ్డిగా నమ్మి భారీగా నష్టపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. కలిసొచ్చేరంగు: బూడిద రంగు
 
 ఇన్సియా కె.
టారో అండ్  ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
సౌర వాణి
 
ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)
సంతోషకరంగా గడిచే ఈవారంలో వ్యవసాయదారులు రుణం పొందడంతోబాటు  దిగుబడి చక్కగా లభించగలదనే నమ్మకాన్ని పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎవరో దూరబోతే ఇద్దరూ ఒకటై వారిని పరాభవించే పరిస్థితి కన్పిస్తుంది. మీకు నచ్చిన వాహనాన్ని, గృహోపకరణాలనీ కొంటారు.
 
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
‘నా పట్టు నాదే’ అనే భావాన్ని వీడి ఒక మెట్టు దిగగలిగితే శుభకార్యం జరగవచ్చు. మాటల్లో కాఠిన్యం లేకుండా ఓర్పు వహిస్తే బంధువుల ద్వారా మనకు రావలసిన ప్రయోజనాలు నెరవేరతాయి. సంతానంలో ఎవరో ఒకరు మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించ వచ్చు. కొన్ని రోజులపాటు వారి ఆలోచనకి ‘సరే’ అని అంటే మళ్లీ మీ తోవకి వచ్చే అవకాశముంది.
 
జెమిని(మే 21-జూన్ 21)
మీరు చేయబోయే పనుల్లో కొంత గుంభనం పాటించడం మంచిది. అసూయ పరుల కారణంగా ముఖ్యమైన మీ ప్రయాణం ఆగిపోవచ్చు. ఈవారంలో ధనార్జన బాగుంటుంది. అయితే మీ పనులకు అభ్యంతరం చెప్పేవారు ఉండవచ్చు. మెత్తగా ఉండాలని మీరు భావించినా పరిస్థితుల ప్రభావం వల్ల అది సాధ్యపడకపోవచ్చు. ఏమైనా కఠినంగా మాట్లాడడం మంచిదికాదు.
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)
అనారోగ్యాన్ని జయిస్తారు. మీ ప్రయత్నం ఏమీ లేకుండానే తెగిపోయాయనుకున్న సంబం ధాలు పునరుద్ధరించబడతాయి. వద్దనుకున్నా ప్రయాణాల పరంపర తప్పదు. వివాదాస్పద విషయాల్లో ఒకప్పుడు కన్పించిన జంకు పూర్తిగా పోయి, ఏమైనా పర్వాలేదనే ధైర్యం వస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఇంటి మరమ్మతులకు ధనవ్యయం కావచ్చు.
 
 లియో(జూలై 24-ఆగస్టు 23)
 రుణాలు తగ్గుముఖం పట్టడంతోనూ, ధైర్యంగా, నిజాయితీతో మీరు నిలబడడంతోనూ, ఆప్తులైన వారు సహాయంగా నిలబడిన కారణంగా మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తండ్రితో  సత్సంబంధాలుంటాయి. న్యాయస్థానంలో చిక్కులన్నీ దాదాపు విడిపోయినట్లే. కొత్త వ్యాపారం ప్రారంభించడం అంత మంచిది కాకపోవచ్చు.
 
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)

పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయనుకుంటూ దూర ప్రయాణాలు చేసినందువల్ల ధన వ్యయం తప్ప ఒరిగేదేమీ లేదని గ్రహించండి. స్వశక్తీ, శ్రమ అనే వాటిని పెట్టుబడిగా పెట్టుకుని, మీమీది నమ్మకం అనే లాభాన్ని సంపాదించుకోండి. మీ సంతానం మీకంటే బాగా ఆలోచించ గలరనిపిస్తోంది. వారు చెప్పింది విని, వారివైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించండి.
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
‘చేతిలో చిక్కిన పక్షి ఆకాశంలో ఎగిరే ఐదు పక్షుల కంటే గొప్పది’ అనే ఓ సామెత ఉంది. లభించిన సౌకర్యానికీ, జరిపిన మధ్యవర్తిత్వానికి సంబంధించిన రాజీ వ్యవహారానికి తృప్తిపడండి తప్ప మరింత ఆశకి వెళితే మూలానికే దెబ్బతగలవచ్చు. వీలైనంత వరకు కలిసిపోవడానికే ప్రయత్నించండి తప్ప ఏ విషయంలోనైనా తెగతెంపుల నిర్ణయానికి రావద్దు.
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
అమ్ముల పొదిలో ఉన్న చివరి బాణం వరకూ శత్రువుల మీద, అసూయపరుల మీద ప్రయోగించి మానసికంగా మీరు అలసిపోవచ్చు. ఇప్పుడు వారు మిమ్మల్ని చేయగలిగేదేమీ లేదు. మంచి ఆధ్యాత్మిక ధోరణి, ధ్యానం, రుద్రాభిషేకం, ఖడ్గమాలా స్తోత్ర పఠనం, లలితా సహస్ర పారాయణం... వంటి వాటితో ఫలితాలు మీకు బాగా కన్పించే అవకాశముంది.
 
శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)
బంధువులతో సంబంధ బాంధవ్యాలు అవసరం. అయితే వాళ్లే లోకంగా జీవిస్తే వృత్తి, వ్యాపారాలకి, విశేషించి ఉద్యోగానికీ ఇబ్బంది తప్పదు. నిర్ణీత కాలవ్యవధిని నిశ్చయించుకుని వ్యవహరించడం తప్పనిసరి. మొహమాటానికి పోయి, మెత్తదనంతో ఉంటున్నందువల్ల మీరు ఇబ్బంది పడుతుండవచ్చు. ఈ ధోరణి ఉద్యోగానికి కష్టాన్ని కల్గించవచ్చు. మరింత జాగ్రత్త!
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మీ దైనందిన వ్యవహారాల్లో మీకు మీరే ఒక చక్కని దిశానిర్దే శాన్ని సమయానుకూలంగా చేసుకుంటారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. విందు వినోద విహారయాత్రలకయ్యే వ్యయాన్ని కొంత అదుపు చేసుకోవలసి ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తుల్ని మెప్పించడానికి కానుకలకోసం ఖర్చు చేయడానికి ఓ హద్దు ఉండాలని గమనించండి.
 
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
 ఆధ్యాత్మికంగా సద్గురు దర్శనం, సేవాభాగ్యం కలగవచ్చుగాని, పూర్తిగా ఆ సేవలోనే తరించడం గృహస్థుగా మీకు ధర్మం కాదు. ఈ విషయంలో కుటుంబంలో ఘర్షణలు ఏర్పడవచ్చు. పనుల ఒత్తిడికి తట్టుకోలేక విశ్రాంతికోసం మానసికానందం కోసం ఒకరిని ఆశ్రయించవచ్చు కాని, దానివల్ల మరో ఒత్తిడి ప్రారంభమవుతుంది. గమనించండి.
 
 పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
 కొంతలో కొంత మనశ్శాంతి కలుగుతుంటుంది. ఆస్తికి సంబంధించిన చర్చల్లో పురోగతి కన్పిస్తుంది. అత్తమామల జోక్యం వల్ల సమస్య సానుకూలంగా పరిష్కరించబడవచ్చు.  ఇలాంటి చిరకాల సమస్యల పరిష్కార సందర్భంలో కొంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మనసుకి ఊరట కలుగుతుంది. పరిశీలించుకోండి.

మైలవరపు శ్రీనివాసరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement