బరువు – బాధ్యత

Lazy will spoil the man - Sakshi

చెట్టు నీడ

పనిని బాధ్యతగా చెయ్యడం ఉద్యోగ ధర్మం. ఆ ధర్మాన్ని మీరడం అంటే  యజమానికి ద్రోహం చెయ్యడమే.  

రామయ్య దగ్గర ఓ గాడిద ఉండేది. అది సోమరి గాడిద. ఎప్పుడూ పని తప్పించుకోవాలని చూసేది. లేదంటే, పని తగ్గించుకోవాలని చూసేది. ఉప్పు బస్తాలను మోయడం దాని పని. ఎప్పటిలాగే ఓ రోజు బద్ధకంగా, అయిష్టంగా ఉప్పు బస్తాను మోస్తూ, దారి మధ్యలో నదిలో పడిపోయింది ఆ గాడిద. రామయ్య దానిని లేవదీసి, తిరిగి నడిపించాడు. బస్తాలోని ఉప్పు కరిగిపోవడంతో గాడిదకు బరువు తగ్గింది. ఆ సంగతి గ్రహించిన గాyì ద, బరువు తగ్గించుకోడానికి ప్రతిరోజూ ఆ నదిలో పడిపోవడం మొదలుపెట్టింది!

అది గమనించాడు రామయ్య. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఓ రోజు.. ఉప్పుకు బదులుగా, అంతే బరువున్న దూది బస్తాను గాడిద వీపు మీద వేశాడు. బరువు తగ్గించుకోవడం కోసం గాడిద మళ్లీ నీళ్లలో పడింది. అయితే ఈసారి దాని బరువు విపరీతంగా పెరిగింది! చచ్చీచెడీ ఆ బరువును మోసుకొచ్చింది. ఇంటికి రాగానే రామయ్య కూడా గాడిదకు రెండు తగిలించాడు.  సోమరితనం మనిషిని పాడు చేస్తుంది. అడ్డదారులు వెతికేలా చేస్తుంది. అది ఎప్పటికైనా ప్రమాదం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top