డిప్రెషన్‌కు దూరంగా ఉండాలంటే... | Keep away from depression ... | Sakshi
Sakshi News home page

డిప్రెషన్‌కు దూరంగా ఉండాలంటే...

Mar 15 2015 11:19 PM | Updated on Sep 2 2017 10:54 PM

డిప్రెషన్‌కు దూరంగా ఉండాలంటే...

డిప్రెషన్‌కు దూరంగా ఉండాలంటే...

డిప్రెషన్ అనేది కేవలం దానికి సంబంధించిన పేషంట్ల సమస్య మాత్రమే కాదు.

మంచి మాట
డిప్రెషన్ అనేది కేవలం దానికి సంబంధించిన పేషంట్ల సమస్య మాత్రమే కాదు. మామూలుగా కనిపించే వాళ్లు, చాలా చురుగ్గా కనిపించే వాళ్లు కూడా అప్పడప్పుడు డిప్రెషన్ బారిన పడిపోతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే....  ఒంటరితనానికి దూరంగా ఉండండి. ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఏ పనీ లేకపోతే టీవిలో సినిమా అయినా చూడండి.  వ్యాయామాలు, ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే, డిప్రెషన్ అంత దూరంగా ఉంటుంది.  

ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టండి. సానుకూల ఆలోచనలకు స్వాగతం చెప్పండి.  మౌనంగా  ఉండడం కంటే మాట్లాడడం వలన డిప్రెషన్‌కు దూరంగా ఉండవచ్చు. ఏ చిన్న బాధ వచ్చినా... మనసులోనే కుమిలిపోకుండా దాన్ని నలుగురితో పంచుకోండి.  స్ఫూర్తిని, సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ప్రముఖుల జీవితచరిత్రలను చదవండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement