breaking news
Good talk
-
మీకో విషయం చెప్పాలి.. ఆ మూడున్నాయా?
ఒకసారి తత్వవేత్త సోక్రటీస్‌ను కలవడానికి ఆయన మిత్రుడు వచ్చి, ‘నీ శిష్యుడు ప్లేటో గురించి ఒక విషయం తెలుసా?’ అని అడిగాడు. ‘ఆగు.. నువ్వు నాకు చెప్పే ముందు చిన్న పరీక్ష. అందులో నువ్వు పాస్ అయితే, ఆ తర్వాత నువ్వు చెప్పాలనుకున్నది చెప్పొచ్చు’ అన్నాడు సోక్రటీస్. వచ్చిన వ్యక్తి ఆశ్చర్యంతో ‘అదేం పరీక్ష?’ అన్నాడు.‘మూడు వడపోతల పరీక్ష. ట్రిపుల్ ఫిల్టర్ టెస్ట్. మొదటి వడపోత ‘నిజం’. అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమని నీకు కచ్చితంగా తెలుసా?’ అడిగాడు సోక్రటీస్. ‘లేదు. నేను విన్నానంతే’. ‘అంటే నువ్వు చెప్పబోయే విషయం నిజమో కాదో నీకు తెలియదు. అంతే కదా? సరే... పోనీలే.నువ్వు అతని గురించి చెప్పబోయేది ఏదైనా ‘మంచి’ విషయమా?’ ‘అది చెడు విషయం.’ ‘చెప్పబోయే విషయం నిజమో, అబద్ధమో కూడా తెలియకుండా అతని గురించి తప్పుగా చెప్పబోతున్నావన్న మాట!’ దీంతో ఆ వ్యక్తి ఇరకాటంలో పడ్డాడు.ఇదీ చదవండి: ఎదుటివారి సంతోషాన్ని చూసి సంతోషించగలరా?‘సరే. మరో వడపోత కూడా ఉంది. ఇందులో పాస్ అయినా నాకు చెప్పొచ్చు. నువ్వు చెప్పబోయే విషయం వల్ల నాకు ఏమైనా ‘ఉపయోగం’ ఉంటుందా?’ ‘లేదు... అలాంటిదేమీ లేదు’.‘అది నిజమో కాదో తెలియదు. అది మంచి విషయం కాదు. దాన్ని నాకు చెప్పడం వల్ల ఉపయోగమూ లేదు. అటువంటప్పుడు ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా? మరేదైనా మాట్లాడుకుందాం!’ అన్నాడు సోక్రటీసు.– యామిజాల జగదీశ్ -
World Thinking Day: ‘మన ప్రపంచం.. మన భవిష్యత్’ థీమ్‌తో..
‘ఏ దేశంలోని ప్రజలు సదాలోచనలతో మెలుగుతారో, ఆ దేశ భవిష్యత్ బంగారుమయం అవుతుంది’ అని అంటారు. దీనికి ప్రతీకగా ‘వరల్డ్ థింకింగ్ డే’(World Thinking Day) అంటే ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని ప్రతీయేటా ఫిబ్రవరి 22న నిర్వహిస్తుంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సదాలోచనల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అలాగే ప్రపంచ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించేందుకు ప్రేరణ కల్పిస్తుంది.ఈ రోజు స్కౌట్ అండ్ గైడ్స్(Scout and Guides)కు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. దేశానికి యువశక్తే వెన్నెముకలాంటిదని అంటారు. 1926లో తొలిసారిగా ‘వరల్డ్ థింకింగ్ డే’ను నిర్వహించారు. నాటి నుంచి ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజున యువతకు గల అధికారాలు, వారి బాధ్యతలపై నిపుణులు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. స్కౌట్ అండ్ గైడ్స్ అంతర్జాతీయ సదస్సు నిర్వహణపై ఈరోజునే ప్రస్తావనకు వచ్చింది. ‘వరల్డ్ థింకింగ్ డే’ తొలిసారిగా లండన్‌లో ప్రారంభమయ్యింది. స్కౌట్ అండ్ గైడ్స్ విభాగం ప్రపంచ సోదరభావాన్ని, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుకే ఈ రోజు స్కౌట్ అండ్ గైడ్స్ సభ్యులు ప్రపంచంలో ఐక్యతకు గల ప్రాధాన్యత, పాజిటివ్ థింకింగ్ గురించి చెబుతుంటారు.2025 ‘వరల్డ్ థింకింగ్ డే’ విషయానికొస్తే ఈరోజును ‘మన ప్రపంచం- మన భవిష్యత్’(‘Our World - Our Future’) థీమ్‌తో నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతలో పలు అంశాల్లో చైతన్యం తీసుకురావడం. అలాగే ప్రపంచాన్ని మరింత అభివృద్ధిదాయకంగా తీర్చిదిద్దడంలో ఐక్యతకు గల అవసరాన్ని చాటిచెప్పడం. వివిధ అంశాలపై యువతరానికి అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ప్రపంచంలోని వివిధ సమస్యలపై ఆలోచించేందుకు, యువత తమ పాత్రను చక్కగా పోషించడానికి ఈరోజు ప్రేరణ కల్పిస్తుంది. ప్రపంచ ఆలోచనా దినోత్సవం నాడు పలుచోట్ల సదాలోచనలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సమాజంలో సానుకూల మార్పులు తీసుకువచ్చేందుకు మేథావులు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రపంచాన్ని మరింత మెరుగైనదిగా మార్చేందుకు ఉపకరించే పర్యావరణం, విద్య, లింగ సమానత్వం లాంటి సామాజిక అంశాలపై చర్చించేందుకు ‘వరల్డ్ థింకింగ్ డే’ వేదికకానుంది.ఇది కూడా చదవండి: Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి -
డిప్రెషన్‌కు దూరంగా ఉండాలంటే...
మంచి మాట డిప్రెషన్ అనేది కేవలం దానికి సంబంధించిన పేషంట్ల సమస్య మాత్రమే కాదు. మామూలుగా కనిపించే వాళ్లు, చాలా చురుగ్గా కనిపించే వాళ్లు కూడా అప్పడప్పుడు డిప్రెషన్ బారిన పడిపోతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే.... ఒంటరితనానికి దూరంగా ఉండండి. ఒకవేళ ఒంటరిగా ఉండాల్సి వస్తే ఏదో ఒక పని చేస్తూ ఉండండి. ఏ పనీ లేకపోతే టీవిలో సినిమా అయినా చూడండి. వ్యాయామాలు, ధ్యానానికి ఎంత దగ్గరగా ఉంటే, డిప్రెషన్ అంత దూరంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టండి. సానుకూల ఆలోచనలకు స్వాగతం చెప్పండి. మౌనంగా ఉండడం కంటే మాట్లాడడం వలన డిప్రెషన్‌కు దూరంగా ఉండవచ్చు. ఏ చిన్న బాధ వచ్చినా... మనసులోనే కుమిలిపోకుండా దాన్ని నలుగురితో పంచుకోండి. స్ఫూర్తిని, సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ప్రముఖుల జీవితచరిత్రలను చదవండి.


