ఆలియాకు కరణ్‌ సారీ | karan johar sorry to aaliya | Sakshi
Sakshi News home page

ఆలియాకు కరణ్‌ సారీ

Jan 7 2018 12:36 AM | Updated on Jan 7 2018 12:36 AM

karan johar sorry to aaliya - Sakshi

మగాళ్లు ఎలా ఉన్నా పర్వాలేదు, బాలీవుడ్‌లో హీరోలైపోతారు! అమ్మాయిలే.. పాపం స్లిమ్‌గా ఉండాలి. స్లిమ్‌గా లేకపోతే చచ్చినట్లు స్లిమ్‌ అవ్వాలి. ఆలియాను ఆమె ఫస్ట్‌ మూవీ ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’కు తీసుకోడానికి కరణ్‌ జోహార్‌ నానా తిప్పలు పెట్టాడు! ఇంత బొద్దుగా ఉంటే నిన్నెవరు చూస్తారు అన్నాడు. ‘తగ్గు. తిండి తగ్గించు, జిమ్‌కి వెళ్లు’ అని ఫోర్స్‌ చేశాడు. ఆలియా చాలా కష్టపడి బరువు తగ్గింది.

ఆమెను అంత కష్టపెట్టినట్టు.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కరణ్‌ జోహార్‌కి గుర్తొచ్చి ఆలియాకు ‘సారీ’ చెప్పాడు! అయినా ఇప్పుడెందుకు ఆయనకు అకస్మాత్తుగా ఆ సంగతి గుర్తొచ్చింది! టీవీ షోలో ఇటీవల ఒక కాలర్‌ కరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘సర్, ఆలియాను బరువు తగ్గమని మీరు అప్పట్లో చాలా బలవంత పెట్టారు కదా. తేలిగ్గా కూడా మాట్లాడారు గుర్తుందా? ఒక ఆడపిల్లను మీరు అలా అనొచ్చా?’’ అని అడిగాడు. కరణ్‌ షాక్‌ కొట్టినట్లు అయిపోయి, కొన్ని క్షణాలు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు.

‘‘అవును నిజమే. అయామ్‌ సారీ ఆలియా’’ అని అప్పటికప్పుడే ఆలియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. ఏమిటి.. కరణ్‌లో సడెన్‌గా ఇంతమార్పు? మొదట్లో అతడు దురుసుగా ఉండేవాడు. అమ్మాయిల్ని హర్ట్‌ చేసేవాడు. ‘స్క్రీన్‌కి పనికొచ్చే షేప్‌ కాదు’ అని కూడా అనేసేవాడు. ఇప్పుడు మనిషి అయ్యాడు! ఎప్పట్నుంచీ? ‘రూహీ’ ఇంట్లోకి వచ్చినప్పుటి నుంచి. రూహీ కరణ్‌ కూతురు. ఏడాది వయసు. సరోగసీ చైల్డ్‌. అందుకే కూతురు ఉండాలంటారు. కూతురు ఉంటే కుటుంబంలోని మగవాళ్లకు సంస్కారం అలవడుతుంది. ‘‘అమ్మాయిలు ఎంత అపురూపమైనవారో నాకు ఇప్పుడు తెలుస్తోంది’’ అని కూడా కరణ్‌ ఇప్పుడిప్పుడే అంటున్నాడు.. రూహీని ముద్దాడుతూ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement