కదంబ వృక్షం

Kadamba tree special - Sakshi

కదంబ మొక్కను రుద్రాక్షాంబ అని కూడా అంటారు. ఇది ఆకు రాల్చదు. ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను ఇస్తుంది. అడవులలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు.

ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి ‘ఓం శక్తిరూపిణ్యై నమః’ అనే మంత్రంతో  పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం.. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top