వెస్ట్రన్‌ డ్రెస్‌కి ఇండియన్‌ హారం

Indian Jewellery on Western Fashion - Sakshi

స్కర్ట్, క్రాప్‌టాప్స్, ఫ్రాక్స్, లాంగ్‌ గౌన్స్‌ ఇలాంటి పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు అలాంటి ఫ్యాషన్‌ జ్యువెలరీ ధరిస్తేనే బాగుంటుంది, సంప్రదాయ ఆభరణాలు అస్సలు నప్పవు అనుకుంటారు. కానీ, వెస్ట్రన్‌ దుస్తులకు మీదకు ఇప్పుడు మన వెడ్డింగ్‌ జ్యువెలరీనీ మ్యాచ్‌ చేయవచ్చు.

బ్లాక్‌ థండర్‌
వెస్ట్రన్‌ కాక్‌టెయిల్‌ పార్టీలకు, ఈవెనింగ్‌ క్యాజువల్‌ డ్రెస్‌గా పేరొందింది నల్లటి మ్యాక్సీ డ్రెస్‌. దీనికి మన వివాహ వేడుకల సమయంలో ధరించే కుందన్‌ నెక్లెస్, చెవి లోలాకులు అద్భుతమైన కాంబినేషన్‌గా అదరగొట్టేస్తాయి. గౌన్‌ ‘వి’ నెక్‌లో ఉంటే దానికి రాణి హారం వేసి, పైన కుందన్‌ నెక్లెస్‌ ధరించవచ్చు. అంతేకాదు వివాహ వేడుకల సమయంలో ధరించే మీనకారి చెవి జూకాలు కూడా ఈ వెస్ట్రన్‌ డ్రెస్‌ మీదకు బాగా నప్పుతాయి.

వైట్‌ వండర్‌
వెస్ట్రన్‌ పార్టీలలో నలుపు ఎలాగో తెలుపు డ్రెస్‌ కూడా అంత అద్భుతమైన అందంతో తళుక్కుమంటుంది. తెల్లటి డ్రెస్‌ వేసుకుంటే దానిమీదకు పోల్కి నెక్లెస్, పెద్ద పెద్ద బంగారు గాజులు వేసుకుంటే ఇండోవెస్ట్రన్‌ కలయికతో అద్భుతమైన లుక్‌ని తీసుకురావచ్చు. సంప్రదాయ లెహంగా చోలీ డ్రెస్సుల మీదకు ఉపయోగించే ఆక్సిడైజ్డ్‌ సిల్వర్‌ గాజులు, నెక్లెస్, జూకాలు, నెక్లెస్‌ వంటివి జీన్స్‌–వైట్‌ షర్ట్‌ మీదకు మాక్సీ డ్రెస్సుల మీదకు సరైన ఎంపిక అవుతుంది.

హాత్‌ఫూల్‌
వివాహవేడుకల్లో వేళ్లను–మణికట్టును కలుపుతూ ఉండే హాత్‌ఫూల్‌ ఆభరణం పాశ్చాత్య దుస్తులకు భిన్నమైన లుక్‌ తీసుకువస్తుంది. డిన్నర్‌ పార్టీకి పొడవాటి చేతులున్న టాప్స్, స్ట్రాప్స్‌ బ్లౌజ్‌లు ధరించినప్పుడు హాత్‌ఫూల్‌ను అందంగా అలంకరించుకోవచ్చు.

వరసల హారాలు
వివాహ వేడుకల కోసం బంగారు హారాలు తీసుకుంటారు. ఇవి మళ్లీ సంప్రదాయ చీర, లెహంగాల మీదకే బాగుంటాయనుకుంటే పొరపాటు. టర్టిల్‌ నెక్, కాలర్‌ షర్ట్స్, డీప్‌ నెక్‌ టాప్స్‌ ధరించినప్పుడు ఒకటికి మూడు వరసలు ఉన్నవి, పచివర్క్‌ హారలు కూడా ధరించవచ్చు,

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top